Honey Trap: మహిళలు వలపు వల విసిరి అందులో చిక్కుకున్న వారిని నిండా ముంచుతున్న ఉదంతాలు రోజూ చూస్తూనే ఉన్నాం. ఉన్నతాధికారులకు, సైనిక సిబ్బందికి యువతులతో గాలం వేయిస్తారు. ఆ గాలానికి చిక్కిన వారితో క్రమంగా దగ్గరవుతారు. వారిని ప్రేమలో, శృంగారంలో ముంచేస్తారు. చివరికి వారి నుంచి లక్షలాది రూపాయలు, అవసరమైన సమాచారం కాజేస్తున్న ఘటనలు నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంటాయి. అయినా మహిళల వలపు వలకు చిక్కుకుని గిలగిలలాడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ వృద్ధుడు ఇలాగే హనీ ట్రాప్ లో చిక్కుకున్నారు. ఏకంగా రూ.82 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. మరో 40 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా.. ఆయన కాస్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..


హోటల్ గదిలో కలాపాలు, సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ


బెంగళూరులో నివాసం ఉంటున్న ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగికి ఓ రోజు ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. తను కష్టంలో ఉన్నట్లు తెలుసుకున్న ఆ 60 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి.. తెలిసిన మహిళ కావడం ఆర్థిక సాయం చేశాడు. అలా వారి బంధానికి పునాది పడిపోయింది. తరచూ ఫోన్ చేసి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆమెతో మాట్లాడుతూ, ఆమె చెప్పేవి వింటుండటం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఓరోజు బాధితుడు ఆమెను ఎలక్ట్రానికి సిటీ హొస్కూర్ గేట్ సమీపంలోని ఓ హోటల్ కు పిలిపించాడు. గది తీసుకుని అక్కడే ఆ రోజు గడిపారు. అలా వారిద్దరూ అదే హోటల్ లో రెండు, మూడు సార్లు కలిసి గడిపారు. ఈ క్రమంలోనే ఆమె ఆయనతో బలవంతంగా రొమాన్స్ చేసింది. తన హనీ ట్రాప్ లో చిక్కుకున్న ఆ వృద్ధుడు కూడా తన వశం అయిపోయాడు. అయితే హోటల్ గదిలో వారు గడుపుతున్న సమయంలోనే.. ఆమె చెల్లి సెల్ ఫోన్ లో వారిద్దరి కలాపాలను చిత్రీకరించింది. 


Also Read: Airport Metro: వచ్చే నెలలో ఎయిర్‌పోర్టు మెట్రో పనులు, 36 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు!


రూ.82 లక్షలు కొట్టేశారు, మరో రూ.40 లక్షలు డిమాండ్ చేశారు


కొన్ని రోజుల తర్వాత వారి రాసలీలల వీడియోలు, ఫోటోలను ఆ వృద్ధుడికి పంపించింది. ఆ చిత్రాలు తన కుటుంబ సభ్యులకు చేరకుండా ఉండాలంటే.. డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేసింది. ఈ వయస్సులో ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంతా ఆ వృద్ధుడు సమర్పించుకున్నారు. అలా దశల వారీగా రూ. 82 లక్షలు గుంజుకుంది. అయినా ఆమె ఇంకా ఇంకా డబ్బులు అడగడం మొదలు పెట్టింది. మరో రూ. 40 లక్షలు కావాలంటూ ఆయనపై ఒత్తిడి పెంచింది. ఆ సొమ్ము ఇవ్వకపోతే నమ్మించి, అత్యాచారం చేశావంటూ కేసు పెడతానని హెచ్చరించారు. దీంతో ఇక లాభం లేదనుకున్నారు. దీంతో బెంగళూరులోని జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కిలాడీ లేడీల గురించి గాలింపు చేపట్టారు. 60 ఏళ్లు దాటిన ప్రభుత్వ ఉద్యోగి హనీ ట్రాప్ లో పడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రిటైర్మెంట్ తో వచ్చిన డబ్బులు అన్నీ.. వలపు వల విసిరి కాజేయడంతో ఆయన కాస్త డబ్బుల్లేని స్థితిలో కష్టాలు ఎదుర్కొంటున్నారు.