Women Teachers Arrested:
అమెరికాలో వరుసగా ఘటనలు..
అమెరికాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రెండ్రోజుల వ్యవధిలోనే ఆరుగురు మహిళా టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 ఏళ్ల విద్యార్థులతో శృంగారంలో పాల్గొన్న కేసులో అదుపులోకి తీసుకున్నారు. థర్డ్ డిగ్రీ రేప్ కింద వాళ్లపై కేసు నమోదు చేశారు. వీరిలో ఓ టీచర్ ఇద్దరు విద్యార్థులతో దాదాపు మూడు సార్లు శృంగారంలో పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎలెన్ షెల్ అనే 38 ఏళ్ల మహిళ ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో టీచర్‌గా పని చేసింది. ఆ తరవాత మరో ఎలిమెంటరీ స్కూల్‌లో చేరింది. ఇక్కడి విద్యార్థులతోనే ఆ పని చేసినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే తల్లిదండ్రులను అలెర్ట్ చేసిన అధికారులు టీచర్లను అరెస్ట్ చేస్తున్నట్టు లెటర్ పంపారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఓ మహిళా ఎడ్యుకేటర్ విద్యార్థిపై ఫస్ట్ డిగ్రీ రేప్‌కు పాల్పడింది. ఈమెనూ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు ఓ 15 ఏళ్ల అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న లేడీ టీచర్‌ని అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ బిల్డింగ్‌లోనే కొన్ని సార్లు శృంగారం చేసినట్టు తెలుస్తోంది. స్నాప్‌చాట్‌లో తరచూ ఇద్దరూ మాట్లాడుకునే వాళ్లు. మరోచోట ఇంగ్లీష్ టీచర్ ఓ టీనేజ్ కుర్రాడితో స్కూల్‌లోనే సెక్స్ చేసినట్టు న్యూయార్క్ టైమ్స్ పోస్ట్ వెల్లడించింది. ఇలా చాలా చోట్ల విద్యార్థులతో మహిళా టీచర్‌లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు అమెరికా అంతటా సంచలనం సృష్టిస్తున్నాయి.
గతంలోనూ..
అమెరికాలోనూ కాదు. ఇండియాలోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్‌లో ఓ టీచర్ స్టూడెంట్‌తో ప్రేమాయణం నడిపిన వ్యవహారం సంచలనమైంది. హైదరాబాద్ చందానగర్ లో స్కూల్ విద్యార్థితో టీచర్ ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థితో అదే స్కూల్ లో టీచర్ గా విధుల నిర్వహిస్తున్న యువతి ప్రేమాయణం నడిపింది. 27 సంవత్సరాల స్కూల్ టీచర్ పదో తరగతి చదువుతున్న విద్యార్థితో ప్రేమించినట్లు తెలుస్తోంది. ఉన్నట్టుండి టీచర్, విద్యార్థి అదృశ్యమయ్యారు. మైనర్ అయిన తమ కుమారుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిందని టీచర్ పై విద్యార్థి తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ యువతి తల్లిదండ్రులు కూడా చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చందానగర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లలో ఇద్దరిపై మిస్సింగ్ కేసు నమోదు అయింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరినీ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఏడాదిగా టీచర్, విద్యార్థి మధ్య ప్రేమాయణం నడుస్తోందని పోలీసులు చెప్పారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే ఇలా దారి తప్పి పిల్లల్నీ తప్పుదోవ పట్టిస్తుండటం తల్లిదండ్రులను కలవర పెడుతోంది.
Also Read: Atiq, Ashraf Shot Dead: అతిక్, అష్రఫ్ హత్యపై రిపోర్ట్ - హోం శాఖకు పంపిన యూపీ సర్కార్