Gunmen Attack On Passengers Vehicles In Pakistan: పాకిస్థాన్‌లో‌ (Pakistan) గురువారం దారుణం చోటు చేసుకుంది. ఓ గిరిజన ప్రాంతంలో ప్రయాణికుల వాహనాలపై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రావిన్సులోని కుర్రం జిల్లాల్లో ఈ ఘటన జరిగింది. ఆప్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో వర్గాల మధ్య ఘర్షణలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.


ఈ క్రమంలో ఓ కీలక రహదారిని కొన్ని వారాల పాటు మూసివేయగా.. ఇటీవలే దాన్ని తెరిచారు. ఈ మార్గంలోనే పరాచినార్ నుంచి పెషావర్‌కు ప్రయాణికులతో వెళ్తోన్న వాహనాలను లక్ష్యంగా చేసుకొని సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. 2 వాహనాలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల సంఖ్య మరింత పెరగొచ్చని ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ నదీమ్ అస్లాం చౌధ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రయాణికులపై దాడి చేయడం పిరికి, అమానవీయ చర్య అని అన్నారు. ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యత వహించలేదని అధికారులు తెలిపారు.


Also Read: US Teacher: అమెరికా స్కూళ్లలో మగపిల్లలపై లేడీ టీచర్ల అఘాయిత్యాలు - డ్రగ్స్, లిక్కర్ ఇచ్చి రేప్ చేసినందుకు టీచర్‌కు 30 ఏళ్లు జైలు శిక్ష