Tandur : వికారాబాద్ జిల్లా తాండూర్ రైల్వే స్టేషన్ లో ఎక్సైజ్ పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ.7.50లక్షల విలువ చేసే 30 కేజీల గంజాయిని రికవరీ చేశారు. ఈ కేసులో నిందితుడిని ఒరిస్సా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో గంజాయిని తీసుకు వస్తూ తాండూర్ లో దిగి శిబిరామ్ స్వాన్ అనే వ్యక్తి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డట్టు సమాచారం. అతని వద్ద నుంచి 30 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బిబి కమలహాసన్ రెడ్డి, ఎక్సైజ్ సూపర్డెంట్ విజయ భాస్కర్ అభినందించారు.
లిక్కర్ షాపులో గంజాయి సేల్స్
మణుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీలోని ఓ మద్యం దుకాణంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అదే గ్రామానికి చెందిన స్వరూప అనే మహిళ నుంచి సుమారు 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఒరిస్సా నుంచి ఓ వ్యక్తి తనకు తక్కువ ధరకే స్వరూపకు గంజాయిని ఇస్తున్నారని విచారణలో తేలింది. ఆమె తన షాపుకు వచ్చే వారికి, కాలేజ్ స్టూడెంట్స్ కు చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో అమ్ముతున్నారని వెల్లడైంది. ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ పంపారు.
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పట్టుబడ్డ 4.9 కిలోల గంజాయి
ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్రకు రైలులో తీసుకువెళ్తున్న ఇద్దరిని గతంలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఒడిశా(Odisha)లోని గాజపాటి జిల్లా ఘాసాపాడ గ్రామానికి చెందిన సర్భన్ నాయక్ అనే వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన తఫాన్ బిషోయో తో పాటు మానస్ ఒడిశాలో రూ.1.22 లక్షల విలువ చేసే 4.9 కిలోల గంజాయిని విక్రయించాడు. అక్కడ్నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ లో మహారాష్ట్రకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో మానస్ పారిపోగా.. తఫాన్ బిషోయోను అరెస్ట్ చేశారు.
Also Read : KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్