Crime News: అందమైన పొదరిల్లు. ప్రేమగా చూసుకునే భర్త. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు. ఏ అమ్మాయికైనా ఇంతకంటే మంచి జీవితం ఏముంటుంది. హాయిగా భర్త పిల్లలతో కాలం గడపాల్సిన ఆ మహిళకు ఓ దుర్బుద్ది పట్టింది. మరో వ్యక్తిపై కన్నేసింది. అతనేమైనా యువకుడా అంటే కాదు... పదిహేనేళ్ల పిల్లాడు. అదే ఊరిలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అలాంటి పిల్లాడిని బుట్టలో వేసుకుంది. సరదాగా ఈ పరిచయం మొదలైంది. బాలుడితో మాటామాటా కలిపింది. అది కాస్త మరింత ముందుకెళ్లింది. చనువు పెరిగింది. ఎప్పుడూ ఏదో ఒక వంకతో ఆ అబ్బాయి వీళ్లింటికి రావడమమో, ఈ మహిళే అబ్బాయి ఇంటికి వెళ్తుండటమో జరిగేది. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటంతో ఎవరూ వీరిన తప్పుడు ఉద్దేశంతో ఎవరూ చూడలేదు. కానీ అదే ఆ తల్లిదండ్రులు పాలిట, మహిళ భర్త, పిల్లల పాలిట శాపంగా మారింది. 


బాలుడి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి విషయం


ఆ ఎనిమిదో తరగతి అబ్బాయిని తీస్కొని ఆ 28 ఏళ్ల మహిళ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఈ అమానవీయ సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. బాలుడి తండ్రి సుందర రాజు ఫిర్యాదు మేరకు గుడివాడ టూ టౌన్ పోలీసులు స్థానికంగా ఉండే స్వప్న అనే మహిళపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. పట్టణంలోని గుడ్ మెన్ పేటలో కుటుంబంతో కలిసి నివాసముండే స్వప్న అనే మహిళ, తన ఎదురింటిలోని ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుంది. ఈ క్రమంలో ఈనెల 19వ తేదీ నుంచి ఇద్దరూ కనపడకుండా పోయారు. 


స్వప్న అబ్బాయిని తీసుకెళ్లిపోవడానికి గల కారణమేంటి..?


మహిళా, బాలుడు ఒకే రోజు నుంచి కనిపించకుండా పోవడంతో బాలుడి తల్లిదండ్రులకు, మహిళ భర్తకు స్వప్న అనుమానం వచ్చింది. భర్త పిల్లలు ఉన్న మహిళ, మైనర్ బాలుడిని తీసుకువెళ్లడం స్థానికంగా సంచలనం రేపుతోంది. బాలుడి తండ్రి సుందర రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. స్వప్న డబ్బులు కోసమే బాలుడిని అపహరించిందా, లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. స్వప్న మాయమాటలతో బాలుడిని తీసుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని టూ టౌన్ సీఐ దుర్గారావు మీడియాకు తెలిపారు.


అయితే తన భార్య స్వప్న.. ఇంటి ముందు అబ్బాయితో చనువుగా ఉన్న విషయం నిజమేనని ఆమె భర్త తెలిపాడు. కానీ వీరిద్దరూ కలిసి ఇలా వెళ్లిపోతారనే ఉద్దేశం మాత్రం తమకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. పిల్లలను వదిలి మరీ వెళ్లడం ఏంటో తనకు ఇంకా అర్థం కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కావాలనే స్వప్న తమ బాబుని తీసుకెళ్లిపోయిందంటూ బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. త్వరగా తమ బాలుడిని పట్టుకొని తమకు అప్పగించాలంటూ పోలీసులను కోరుతున్నారు.