Holi Murder:  రంగులు పూయించుకోలేదని ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన రాజస్థాన్ లోని దౌసాలో జరిగింది. హన్స్ రాజ్ అనే వ్యక్తి లైబ్రరీలో చదువుకుంటున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు రంగులు పూసేందుకు వచ్చారు. అయితే ఆ రంగులు పూయించుకునేందుకు హన్స్ రాజ్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో అతన్ని ముగ్గురు వ్యక్తులు బెల్టులతో కొట్టారు. తరవాత గొంతు కోసి చంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ముగ్గురు వ్యక్తులు హన్స్ రాజ్ గ్రామంలోనే ఉంటారని పోలీసులు గుర్తించారు.  



హన్స్ రాజ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అందు కోసం లైబ్రరీలోనే ఎక్కువ సేపే ఉంటూ  చదవుకుంటూ ఉన్నాడు. అయితే ్తని చదువును డిస్ట్రబ్ చేయాలని ఉద్దేశమో లేకపోతే  హోలీ పండుగ అని ఏమో కానీ రంగులు పూసేందుకు ప్రయత్నించారు. రోడ్డు మీద కూడా కాకుండా నేరుగా లైబర్రీలోకి వచ్చి రంగులు పూసే ప్రయత్నం చేశారు. కానీ అతను అంగీరించలేదు. దాంతో నిందితులలో ఒకరు హన్స్‌రాజ్‌ను గొంతు కోసి చంపారని పోలీసులు ప్రకటించారు.  



మృతుడి కుటుంబ సభ్యులు ,  గ్రామస్తులు హన్స్‌రాజ్ మృతదేహంతో గురువారం తెల్లవారుజామున 1 గంట వరకు నిరసన తెలిపారు   జాతీయ రహదారిని దిగ్బంధించారు. హన్స్‌రాజ్ కుటుంబానికి 50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నిందితులైన ముగ్గురిని వెంటనే అరెస్టు చేయాలని  డిమాండ్ చేశారు.    


రంగులు పూయించుకోవాలా లేదా అన్నది వారి ఇష్టమని ఇలా వ్యతిరేకించినందుకు చంపడం ఏమిటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిందితుల్ని వదిలి పెట్టకూడదని అంటున్నారు.