Bapatla Kendriya Vidyalaya Students Are Ill: బాపట్ల జిల్లా బాపట్ల (Bapatla) మండలం సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో (Kendriya Vidyalaya) శనివారం ప్రమాదం జరిగింది. సైన్స్ ల్యాబ్‌లో అనుకోకుండా విడుదలైన విష వాయువులు పీల్చిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఊహించన ఘటనతో ఊపిరాడక విద్యార్థులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. దాదాపు 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ఉపాధ్యాయులు వారిని బాపట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ బి.సుబ్బారావు విద్యార్థులను పరామర్శించారు. 

Continues below advertisement


అదే కారణమా.!


కాఫీ పొడి, షుగర్‌తో పాటు, సోడియం, ఇతర కెమికల్స్ కలిపిన ఫౌడర్‌ను ఓ విద్యార్థి తీసుకువచ్చి ఇతర విద్యార్థులకు వాసన చూపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారని అధికారులు గుర్తించారు. మరోవైపు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. సైన్స్ ల్యాబ్‌లో విద్యార్థులు కెమికల్స్ మిక్స్ చేసిన సమయంలో ప్రమాదకర వాయువులు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని.. వైద్య సాయం అందిస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. 


Also Read: Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి విడుదల - వైసీపీ నేతల ఘన స్వాగతం, మాచర్లకు పయనం