Dhan Varsha tantric scam:  ప్రజల్ని అన్ని విధాలుగా దోచుకునే మోసగాళ్లు దేశంలో ఎక్కడ చూసినా ఉన్నారు. ప్రజలు పేదవాళ్లు అయితే వాళ్ల మాన ప్రాణాల్ని కూడా దోచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో కొంత మంది తాంత్రిక గురువుల పేరుతో పేదల ఇళ్లలోని అమాయక అమ్మాయిల శరీరాలతో ఆడుకున్న వైనం వెలుగు చూసింది.                      

యూపీలోని  సంభాల్ అనే ఊళ్లోని పోలీస్ స్టేషన్ కు ఓ యువకుడు వచ్చి తనను మానవబలి ఇచ్చేందుకు కొంత మంది తాంత్రికులు ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. ఆ యువకుడి ఫిర్యాదుని తీసుకున్న పోలీసులు ఆ తాంత్రికుల్లో కొంత మందిని పట్టుకున్నారు. వారి వ్యవహారం తేడాగా ఉండటంతో వారి ఫోన్లను పరిశీలించారు. అందులో వీడియోలు చూసి షాక్ కు గురయ్యారు. వెంటనే ఆ ముఠాలోని మిగతావారిని పట్టుకున్నారు. మొత్తం పధ్నాలుగు మందిని అరెస్టు చేశారు.                 

వారి ఫోన్లలో అత్యంత ఘోరమైన వీడియోలు ఉన్నాయి. అమ్మాయిల్ని నగ్నంగా పెట్టి వారి ఒంటికి రకరకాల పూజా సామాగ్రి చుట్టి పూజలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ యువతులపై గురువు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. దాన్ని  తాంత్రిక కర్మ అంటారని.. అలా చేస్తే ధన వర్షం కురుస్తుందని వారు ఆ అమ్మాయిల కుటుంబాలను నమ్మించారు.               

ఈ పధ్నాలుగు మంది వ్యవస్థీకృత నేరాలకు అలవాడు పడ్డారు.   14 మందిలో నలుగురు "గురువులు"గా మారారు. వీరు అందరిదీ ఇతర ఉద్యోగాలు, వయాపారాల్లో ఉన్నారు.  ఆగ్రాలోని యమునా బ్రిడ్జ్ రైల్వే స్టేషన్‌లో రైల్వే స్టేషన్ మాస్టర్ అఘుబీర్ సింగ్ (45) కూడా ఓ గురువుగా ఉన్నారు.  డిఎన్ త్రిపాఠి అనే వ్యక్తి  జ్యోతిష్యుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. అలాగే ఆగ్రాలో ఆయుర్వేద వస్తువుల దుకాణ యజమాని సంజయ్ చౌహాన్, మెడికల్ స్టోర్ యజమాని సంతోష్ సింగ్ కూడా కూడా ఈ దారుణాలకు పాల్పడుతున్న వారిలో ఉన్నారు.              

వీళ్లు నిరుపేదలు, పెద్దగా చదువు లేని కుటుంబాలను టార్గెట్ చేసుకునేవారు. వారి కుటుంబాల్లో అమ్మాయి.  కన్యగా ఉంటే. మంచి ఎత్తు, పొడుగు ఉంటే..ఎంత అందంగా ఉంటే అంత ధన వర్షం కురుస్తుందని నమ్మించేవారు.  ఒక అమ్మాయిని ఎంపిక చేసిన తర్వాత ఆమెపై అన్ని రకాల దోపీడికి పాల్పడేవారు. లైంగిక దోపిడీతో సహా అన్ని పనులు చేసవారు.  ఎటావాకు చెందిన ఒక తండ్రి తన కుమార్తెపై మూడుసార్లు  ధనవర్ష క్రియ చేయించారు. బాధితులైన మహిళల్ని కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరు చేసిన నేరాల్లో బయటపడింది తక్కువేనని ఇంకా చాలా బయటపడాల్సి ఉందని అంటున్నారు.