Maoists Attack in Dantewada:
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు పోలీసులపై దాడి చేశారు. మందుపాతర దాడిలో డ్రైవర్ సహా 10 మంది పోలీసులు మృతి చెందారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది వాహనాన్ని టార్గెట్ చేసుకుని మందుపాతర పేల్చారు. అర్ణపూర్‌లో ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
"ఈ ఘటన గురించి సమాచారం అందింది. ఇలా జరగటం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మావోయిస్టులపై మా యుద్ధం కొనసాగుతుంది. వాళ్లను వదిలే ప్రసక్తే లేదు"
- భూపేశ్ బగేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి