Zuckerberg Daily Routine:ఫేస్‌బుక్, మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మళ్ళీ వార్తల్లోకెక్కారు. ఇప్పటి వరకు వివిధ యాప్ అప్‌డేట్స్‌తో వార్తల్లో ఉండి జుకర్‌బర్గ్ ఈసారి తన డైలీ రొటీన్ చర్యలతో వైరల్ అవుతున్నారు. ఈయనతోపాటు టాప్ టెక్ లీడర్లు తమ రోజును ఎలా ప్రారంభిస్తారు. సామాన్యులకు వారు చేసే పనులకు భిన్నంగా ఏముంటుందనే ఆసక్తి చాలా మందిలో కనిపిస్తుంది.
'రాడ్డాగ్ రొటీన్' అంటే ఏమిటి?ప్రతి రోజూ నిర్దిష్ట ప్రణాళికతో చేసే పనులను సోషల్ మీడియాలో 'రాడ్డాగ్ రొటీన్' అంటారు. అంటే ఉదయం లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకు క్రమం తప్పకుండా టైంసరికి చేసే పనులను ఇలా పిలుస్తారు. ఇందులో ముఖ్యంగా ఎలాంటి ఉత్తేజకాలు అంటే కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్ లేదా ఏదైనా మందులు లేకుండా రోజును ప్రారంభిస్తారు. జుకర్‌బర్గ్ అభిప్రాయం ప్రకారం మీరు ఉదయం ఎటువంటి ఫుడ్, డ్రింక్ సహాయం లేకుండా యాక్టివ్‌గా ఉంటే మీ మనస్సు, శరీరం మరింత స్ట్రాంగ్ అవుతాయి.
జుకర్ బర్గ్ ఉత్తేజంగా ఉండటానికి ఉదయం కాఫీ అవసరం లేదని చెబుతారు. సెలవుల్లో కొన్నిసార్లు ఆనందం కోసం కాఫీ తాగుతారు, కానీ పని దినాల్లో ఎప్పుడూ కాఫీ తాగనని అంటున్నారు.
జుకర్‌బర్గ్ ఉదయాన్నే చేసే పనులుజుకర్‌బర్గ్ ఉదయం ఎటువంటి కాఫీ లాంటి ద్రవపదార్థాలు తీసుకోరు. అయినా సరే ఆయన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందని నమ్మకం. రోజంతా యాక్టివ్‌గా ఉంటానని అంటారు.
ప్రతి ఉదయం దాదాపు రెండు గంటలు బ్రెజిలియన్ జియు-జిట్సు , MMA (మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్) శిక్షణ తీసుకుంటారు. ఇది తేలికపాటి వ్యాయామం కాదు. మార్షల్ ఆర్ట్స్ వల్ల ఫోకస్ పెరుగుతుంది. దీని వల్ల మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. అదే చేస్తారు జుకర్‌బర్గ్
జుకర్‌బర్గ్ రోజూ ఒకేలాంటి దుస్తులు ధరిస్తారు, గ్రే టీషర్టు, జీన్స్. దీనివల్ల చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. జీవితాలను మార్చే పెద్ద పెద్ద విషయాలపై ఫోకస్డ్‌గా ఉండొచ్చు.
వ్యాయామం తర్వాత శక్తి కోసం ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు. తగిన ఎక్కువ కేలరీలు ఫుడ్ తీసుకుంటారు.
జుకర్‌బర్గ్ కాఫీ ఎందుకు తాగడం లేదు?జుకర్‌బర్గ్ చెప్పినదాని ప్రకారం వారు చిన్నతనంలో పాఠశాలలో 'DARE' అనే కార్యక్రమంలో మనస్సు, శరీరాన్ని బలపరచడానికి ఉత్తేజకరమైన వాటికి దూరంగా ఉండాలని నేర్చుకున్నారు. అప్పటి నుంచి శరీరానికి తాత్కాలికంగా ఉత్తేజాన్ని ఇచ్చే వస్తువుల సహాయం తీసుకోరు. తమను తాము మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఇతర టెక్ లీడర్లు ఏం చేస్తారు?ఎలాన్ మస్క్ రోజంతా చాలా కాఫీ తాగుతారు. చాలా సమయం పని చేస్తారు. ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ మార్నింగ్ ధ్యానం, చల్లని నీటితో స్నానం వాటితో ప్రారంభిస్తారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మంచిగా నిద్రపోవడం, రోజును ప్రశాంతంగా ప్రారంభించడానికి ఇష్టపడతారు. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఉదయం త్వరగా లేచి రోజంతా చురుకుగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. జుకర్‌బర్గ్ పద్ధతి ఇతరులకు భిన్నంగా ఉంటుంది ఎందుకంటే వారు ఎలాంటి పదార్థాల సాయం లేకుండానే రోజును ప్రారంభిస్తారు.