Stock Market India: కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతోనే భారత్ స్టాక్‌మార్కెట్‌లలో సరికొత్త ఉత్సాహాన్ని ప్రదర్శించాయి. రెండు రోజులుగా కొనసాగుతున్న నష్టాలకు బ్రేక్‌ వేసింది. ఇదే జోరు రేపు కొనసాగుతుందా అనేది అందరిలో కనిపిస్తున్న ఉత్కంఠ. ఆ వివరాలు గురించి ఇక్కడ చూద్దాం. నేటి సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త వృద్ధిని నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 118.77 పాయింట్లు లేదా 1.65 శాతం లాభపడి 73,134,32 వద్ద స్థిరపడింది. అదే విధంగా నిఫ్టీ 348 పాయింట్లు వృద్ధితో 22,679.40 వద్ద ముగిసింది. 

ఈ భారీ పెరుగుదల కారణంగా బీఎస్‌ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లో ఉన్న రూ. 411 లక్షళ కోట్ల నుంచి 422 లక్షళ కోట్లకు చేరింది. అంటే ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద సుమారు 11 లక్షల కోట్లు పెరిగింది. 

ఈ పెరుగుదలకు కారణమేంటీ?

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ పురోగతికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ట్రంప్ ప్రకటన. ఇరాన్‌పై సైనిక చర్య మరో రెండు మూడు వారాల్లో ముగుస్తుందని చెప్పడంతో మార్కెట్‌లో జోష్ కనిపించింది. మధ్యప్రాచ్యంలో అనిశ్చితి తగ్గుతుందనే నమ్మకం పెట్టుబడిదారుల్లో కనిపించింది. దీనికి తోడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధలు 105 డాలర్ల స్థాయికి తగ్గడం కూడా భారత్‌ మార్కెట్‌కు బాగా కలిసి వచ్చింది. రూపాయి విలువ స్థిరంగా ఉండటం కూడా మరో కారణం. గతంలో భారీగా తగ్గిన షేర్లను తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం మార్కెట్‌కు బలాన్ని ఇచ్చింది. డిఫెన్సివ్‌ నుంచి సైక్లికల్‌ రంగాల వైపు పెట్టుబడిదారులు మొగ్గు స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాంకింగ్, కెమికల్స్‌, మెటల్స్, రియాల్టీ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. 

టాప్ గెయినర్స్ ఎవరు? 

బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే సానుకూలత కనిపించింది. మిడ్ క్యాప్,స్మాల్ క్యాప్ షేర్లు లార్జ్ క్యాప్‌ షేర్ల కంటే మెరుగ్గా రాణించాయి. స్మాల్‌ క్యాప్‌, మిడ్ క్యాప్‌ సూచీలు మూడు శాతానికిపైగా వృద్ధిని సాధించాయి. 

టాప్ గెయినర్స్‌ ఇవే 

ట్రెంట్‌- 6.74 శాతం, ఇండిగో- 6.22 శాతం, అదానీ పోర్ట్స్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్, ఎస్‌బీఐ షేర్లు కూడా 3.34 శాతం నుంచి 5.47 శాతం వరకు పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి దిగ్గజ షేర్లు రాకెట్‌లా దూసుకెళ్లాయి. 

రేపటి మార్కెట్ ఎలా ఉండబోతోంది?

మార్కెట్ రికవరీ సంకేతాలు చూపిస్తున్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ ప్రస్తుతం 22,400-23,500 శ్రేణిలో కన్సోలిడేషన్ దశలో ఉంది. నిఫ్టీ 23000 స్థాయిని దాటితేనే మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక వేళ 22,500 దిగువకు మళ్లీ పడిపోతే అమ్మకాల ఒత్తిడి ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సెన్సెక్స్‌కు 72,400-72,500 వద్ద బలమైన మద్దతు ఉందని, 73,900-74,000 వద్ద రిసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మార్చి నెలలో మార్కెట్‌లు భారీగా షేక్ అయ్యింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు, ఇంధన సరఫరా వ్యవస్థలో మార్పులు మార్కెట్‌పై సానుకూలంగా ఉంటుందని గతమంతా ఒత్తిడి లేకపోవచ్చని చెబుతున్నారు.