Adani vs Soros: 


పదేళ్ల క్రితం మూసేసిన కేసులోని అంశాలతో ఓసీసీఆర్పీ అదానీ గ్రూప్‌పై దాడి చేయడం సంచలనంగా మారింది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ జరగబోతున్న నేపథ్యంలో ఈ రిపోర్టు రావడం అనుమానాలకు తావిస్తోంది. ఓసీసీఆర్పీకి జార్జి సొరోస్‌ నేతృత్వంలోని ఓపెన్‌ సొసైటీ ఫండింగ్‌ ఇస్తోంది. ఆయన మొదట్నుంచీ అదానీ, ప్రధాని మోదీని టార్గెట్‌ చేసినట్టే కనిపిస్తోంది! అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ (డీప్‌స్టేట్‌), రాక్‌ ఫెల్లర్‌ ఫౌండేషన్‌, ఫోర్డ్‌ ఫౌండేషన్‌తో ఆయన అనుబంధం అందరికీ తెలిసిందే.


ప్రపంచ దేశాల్లోని రాజకీయాలను తలకిందులు చేయగలిగే జార్జి సొరోస్‌ భారత్‌ మీద ఎందుకు గురిపెట్టారు? దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీని ఎందుకు టార్గెట్‌ చేశారు? ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని ఎందుకు చెప్పారు? ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు 'రెజిమ్‌ ఛేంజ్' తప్పనిసరని ఆయన ఎందుకు అన్నారు? అసలు ఎవరీయన?


జార్జి సొరోస్‌ చరిత్ర


జార్జి సొరోస్‌ హంగేరియన్‌ - అమెరికన్ వ్యాపారవేత్త. అనేక దేశాల్లో ఆయనకు పెట్టుబడులు, వ్యాపారాలు ఉన్నాయి. వేల కోట్ల ఆస్తులను ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌కు ఇచ్చారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారు. లెఫ్ట్ లిబరల్స్‌కు ఆయన అధిక ప్రాధాన్యం ఇస్తారు. తనదైన ఆర్థిక నిర్ణయాలు, పెట్టుబడులతో వివాదాస్పదంగా మారారు. 1930లో బుడాపెస్టులో జన్మించిన సొరోస్‌ రెండో ప్రపంచ యుద్ధంలో హంగేరీ నాజీ ఆక్రమణ నుంచి తప్పించుకున్నారు. యుద్ధం ముగిశాక ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు.


బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ బ్రేకర్‌


లండన్‌లో 1969లో ఫైనాన్షియల్‌ ట్రేడర్‌గా మొదలైన జార్జి సొరోస్‌ ప్రస్థానం అనేక మలుపులు తిరిగింది. సొంతంగా ఒక హెడ్జ్‌ ఫండ్‌ను స్థాపించారు. చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫండ్‌గా మార్చారు. ఫైనాన్షియల్‌ మార్కెట్లోని అసమర్థతను ఆసరాగా తీసుకొని కోట్లు కొల్లగొడతారని పేరు. 1992లో ఆయన బ్రిటిష్‌ పౌండ్‌ స్టెర్లింగ్‌పై పందెం కాశారు. పౌండ్‌ విలువ తగ్గగానే ఆయన ఒక బిలియన్‌ డాలర్లు లాభం ఆర్జించారు. దాంతో 'బ్యాంక్‌ ఆఫ్ ఇంగ్లాండ్‌'ను బద్దలు కొట్టిన వ్యక్తిగా పేరొచ్చింది.


ఉదార రాజకీయాలకు ఫండింగ్‌


ఉదార రాజకీయాలకు జార్జి సొరోస్‌ ఎక్కువగా ఫండింగ్‌ ఇస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కులు, ప్రజా స్వామ్యం, విద్య కోసం బిలియన్‌ కొద్దీ డాలర్లను విరాళంగా ఇచ్చారు. అమెరికాలో ఆయన లెఫ్ట్‌ లిబరల్స్‌ ఆధిపత్యంలో ఉండే డెమొక్రాట్లకు మద్దతుగా ఉన్నారు. ఆయన ఇస్తున్న విరాళాలపై కొందరు ప్రశంసలు కురిపిస్తే మరికొందరు విమర్శలు కురిపిస్తారు. ఫండింగ్‌ చేయడం ద్వారా తన సొంత పొలిటికల్‌ అజెండాను రుద్దుతున్నారని ఆరోపిస్తారు. అయితే ప్రపంచాన్ని మరింత మెరుగ్గా మారుస్తున్నానని ఆయన డిఫెండ్‌ చేసుకుంటారు. వివాదాలు ఎన్ని ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావం చూపించే వ్యక్తుల్లో ఆయన ఒకరు.


భారత్‌లో ఓపెన్‌ సొసైటీ


జార్జి సొరోస్‌కు చెందిన ఓపెన్‌ సొసైటీ భారత్‌లోనే సేవలు అందిస్తోంది. అయితే క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తోందని, మత మార్పిడులకు పాల్పడుతోందని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఫండింగ్‌ ఇవ్వడం ద్వారా ఇలాంటి కార్యకలాపాలు చేస్తోందని అంటారు. అందుకే ప్రధాని నరేంద్రమోదీ ఫారిన్ ఫండింగ్ వస్తున్న వందలాది ఎన్‌జీవోలను నిషేధించారని విశ్లేషలకుల మాట. ఒకప్పుడు సాఫ్ట్‌ పవర్‌గా కనిపించిన భారత్‌ నేడు తనదైన విదేశాంగ విధానం, కఠిన నిర్ణయాలు, తెలివైన వ్యూహాలతో స్ట్రాంగ్‌ పవర్‌గా మారింది. అనేక దేశాలు భారత ప్రధాని రాకకోసం ఎదురు చూస్తున్నాయి. ఆయన మరోసారి కొనసాగితే విదేశీ శక్తుల ఆట కట్టేనని కొందరి నమ్మకం!


కుట్రలకు రచన?


కొందరు స్వతంత్ర జర్నలిస్టులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఫండింగ్‌ ఇవ్వడం ద్వారా జార్జి సొరోస్‌ ఫౌండేషన్‌ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయిస్తోందని మోదీ అభిమానుల ఆరోపణ! డిజిపబ్‌లోని చాలా సంస్థలకు ఓపెన్‌ సొసైటీ నుంచి నిధులు అందుతుండటాన్ని వారు ఉదహరిస్తారు. రోజురోజుకీ బలంగా మారుతున్న ప్రధాని నరేంద్రమోదీని అధికారం నుంచి దించేయాలంటే ఆయన సన్నిహితులను దెబ్బతీయాలన్నది సొరోస్‌ వ్యూహంగా చెబుతారు. ఇందులో భాగంగానే అదానీని పదేళ్ల క్రితం నుంచే టార్గెట్‌ చేశారని సమాచారం. ప్రపంచంలోని అత్యంత కీలక ప్రదేశాల్లో అదానీ పోర్ట్స్‌.. నౌకాశ్రయాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే.


అదానీపై దాడితో మోదీ టార్గెట్‌!


ఇందులో భాగంగానే మొదట హిండెన్‌బర్గ్‌తో అదానీ గ్రూప్‌పై దాడి చేయించారని ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా ఎఫ్‌పీవో సమయంలో చేయడంతో అదానీ నెట్‌వర్త్‌ 50 శాతానికి పైగా తగ్గిపోయింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్టపోతే ఆందోళన మొదలవుతుందని, భారత్‌ పెట్టుబడులకు సురక్షితం కాదని ప్రచారం చేయొచ్చని భావించారు. కానీ అలా జరగలేదు. పైగా సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ అదానీ గ్రూప్‌ షేర్ల ధరల్లో ఎలాంటి అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవని చెప్పింది. ఇప్పుడు హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై సుప్రీం కోర్టులో తుది విచారణకు వేళైంది. వారం రోజుల కిందటే ఓ భారత కంపెనీపై ఓసీసీఆర్పీ తెలిపింది. ఇది అదానీపై దాడేనని చాలామంది అంచనా వేశారు. అలాగే జరిగింది. ఈ వివరాలను విజయ్‌ గజేరా అనే ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు తన ట్విటర్లో (https://twitter.com/vijaygajera/status/1621048615329468417) బహిర్గతం చేశారు. 


రాహుల్‌కు మార్గనిర్దేశం?


ప్రధాని నరేంద్ర మోదీని దించాలంటే ప్రతి పక్షాలను ఏకం చేయాలన్నదీ విదేశాల నుంచి వచ్చిన ప్రణాళికేనని బీజేపీ అంటోంది. ఒకప్పుడు చైనా ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన రాహుల్‌ గాంధీ ఇప్పుడు బ్రిటన్‌, అమెరికాలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. అక్కడి యూనివర్సిటీలు, భారత వ్యతిరేక సంస్థల నుంచి ఐడియాలు తెచ్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. భారత జోడో యాత్రలో ఓపెన్‌ సొసైటీ సభ్యులు చాలామంది రాహుల్‌ గాంధీతో కలిసి నడవడాన్ని సాక్ష్యంగా చూపిస్తున్నారు. (https://twitter.com/vijaygajera/status/1697195509222645955) కాగా జార్జి సొరోస్‌కు డ్రగ్స్‌, గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నాయని కొందరి పరిశోధనల్లో తేలింది.


డ్రగ్‌ మాఫియాపై ఆరోపణలు


ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో డ్రగ్స్‌, గంజా మాఫియాను జార్జి సొరోస్‌ నడిపిస్తున్నాడని కొన్ని ఆరోపణలు, థియరీలు ఉన్నాయి. అసలు గంజాయిని లీగలైజ్ చేయాలని ఆయన అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అమెజాన్లో SOROS: THE DRUG LORD. PRICKING THE BUBBLE OF AMERICAN SUPREMACY (21 Drug Free Challenge) అనే పుస్తకమే ఉంది. Michele Steinberg రాసిన Soros and the British Drug Lords:
How the Empire Created ‘Decrim ఓ పేపర్‌ సంచలనం సృష్టించింది. మయన్మార్‌, శ్రీలంక, పాకిస్థాన్‌ వంటి దేశాల్లో గంజాయి అక్రమ సాగు చేయిస్తున్నారని సమాచారం. ఎప్పుడైతే గంజాయిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో అక్కడ అల్లర్లు జరుగుతాయని చాలామంది అనుమానిస్తున్నారు. ఈ మధ్యే మణిపుర్‌లో క్వింటాళ్ల కొద్దీ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే.


Also Read: FPO టైమ్‌లో హిండెన్‌బర్గ్‌ దాడి! సుప్రీం విచారణ టైమ్‌లో ఓసీసీఆర్పీ దాడి!