జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం బుధవారం నాడు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పన్నుల విధానంలో అనేక పెద్ద మార్పులు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలో ఇకపై రెండు ప్రధాన జీఎస్టీ శ్లాబ్‌లు మాత్రమే ఉంటాయని నిర్ణయించారు - 5%, 18% మాత్రమే ఉంటాయి. 12%, 28% శ్లాబ్‌లను రద్దు చేశారు.

హానికరమైన వస్తువుల కోసం ప్రత్యేకంగా 40% శ్లాబ్‌ను ఏర్పాటు చేశారు. ఏయే వస్తువులు చౌకగా మారాయో తెలుసుకుందాం.

ఏయే వస్తువులు చౌకగా మారాయి

సమావేశంలో సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా అనేక నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గించారు.

  • జీరో టాక్స్ స్లాబ్‌లో: నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరైజర్స్‌, షార్పనర్లు, యూహెచ్‌టీ పాలు, చీజ్‌, పనీర్, పిజ్జా బ్రెడ్, రోటీ,  పరాఠా వంటివి ఉన్నాయి.
  • 5% టాక్స్ స్లాబ్‌లో: షాంపూ, సబ్బులు, నూనెలు, ఉప్పు, పాస్తా, కాఫీ మరియు నూడుల్స్, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు  ఉంచారు.
  • 18% టాక్స్ స్లాబ్‌లో: కార్లు, బైక్‌లు, సిమెంట్, టీవీలు ఉన్నాయి. ఏసీలు, 32 ఇంచెస్ లోపు టీవీలు, సాధారణ కార్లు, 350 సీసీ లోపు బైకులపై ఇంతకుముందు వీటిపై 28% పన్ను ఉండేది.
  • జీఎస్టీ నుంచి మినహాయింపు: 33 ప్రాణాలను రక్షించే మందులను పూర్తిగా పన్ను పరిధి నుంచి మినహాయించారు, వీటిలో 3 క్యాన్సర్ మందులు కూడా ఉన్నాయి.

 

ఈ వస్తువులు మరింత ప్రియం కానున్నాయి

40% కొత్త టాక్స్ స్లాబ్‌లో సూపర్ లగ్జరీ, హానికరమైన వస్తువులను చేర్చారు. వీటిలో పాన్ మసాలా, సిగరెట్లు, గుట్కా, బీడీలు, పొగాకు ఉత్పత్తులు, ఫ్లేవర్డ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉన్నాయి.

సెప్టెంబర్ 22 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయి

సమావేశంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయని ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి తెలిపారు. అంటే, ఈ తేదీ నుంచి అనేక వస్తువులు చౌకగా లభిస్తాయి, అయితే విలాసవంతమైన మరియు హానికరమైన ఉత్పత్తులు ప్రియం అవుతాయి.

రాష్ట్రాల మద్దతు

పన్ను రేట్లను సరళీకరించే ప్రతిపాదనకు అన్ని రాష్ట్రాల ప్రతినిధులు మద్దతు తెలిపారని హిమాచల్ ప్రదేశ్ మంత్రి రాజేష్ ధర్మాని తెలిపారు. ఇప్పుడు దేశంలో ప్రభావవంతంగా కేవలం రెండు టాక్స్ స్లాబ్‌లు ఉంటాయి - 5% ,18%.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విధంగా అన్నారు

సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, "ఈ సంస్కరణలు సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని చేశారు. రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీ శ్లాబ్‌లను తగ్గించారు. దీనివల్ల ఆరోగ్య, వ్యవసాయ రంగానికి పెద్ద ఉపశమనం లభిస్తుంది. శ్రమ ప్రధాన పరిశ్రమలకు కూడా ఇది బలం చేకూరుస్తుంది."