Deloitte Clean Audit Opnion to VerSe: టెక్నాలజీ, డిజిటల్ కంటెంట్ ప్రొవైడింగ్ ప్లాట్ ఫామ్ లు అయిన డెలీహంట్, జోష్ లకు మాతృసంస్థ అయిన Verse Innovation 2024 వార్షిక ఆర్థిక నివేదికలపై Deloitte క్లీన్ ఒపీనియన్ ఇచ్చింది. కొన్ని నిర్వహణపరమైన లోపాలున్నప్పటికీ.. అవి తమ ఓవరాల్ ఓపీనియన్‌ను ప్రభావితం చేయగలిగినవి కావని డెల్లాయిట్ తన నివేదికలో తెలిపింది. Verse Innovation లో అంతర్గత నియంత్రణల్లో కొన్ని లోపాలును డెల్లాయిట్ ప్రస్తావించడంతో కంపెనీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. అయితే మొత్తం మీద ఆర్థిక నిర్వహణ సక్రమంగానే ఉందని డెల్లాయిట్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
తమ ఆర్థిక నివేదికలు నిజమైనవి పారదర్శకంగా ఉన్నాయని క్లీన్ రిపోర్ట్ ద్వారా తేలిందని Verse సహ వ్యవస్థాపకుడు ఉమాంగ్ బేడీ అన్నారు. "మా కంపెనీలో కొన్ని నియంత్రణలు బలహీనంగా ఉన్నాయని డెల్లాయిట్ చెప్పింది. అయితే ఆ బలహీనతలు సంస్థ ఓవరాల్ ఆర్థిక నివేదికలపై ఎలాంటి ప్రభావం చూపలేదు” అని ఆయన Inc42తో అన్నారు.
ఆడిట్ లోపాలు
మార్చి ౩1తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి VerSe Innovationలోని కొన్ని ఆడిట్ లోపాలను వారి ఆడిటింగ్ సంస్థ డెల్లాయిట్ గుర్తిచింది. అంతర్గతంగా కొన్ని “మెటీరియల్ వీక్‌నెస్” లు ఉన్నట్లు డెల్లాయిట్ తమ ఆడిట్ రిపోర్ట్‌లో ప్రస్తావించింది. ఈ లోపాల వల్ల కొన్ని ముఖ్యమైన అకౌంటింగ్ విభాగాలైన నిర్వహణ వ్యయం, వాణిజ్య చెల్లింపులు, ఖర్చుల ఖాతాల్లో అవకతవకలకు దారితీయొచ్చని హెచ్చరించింది. Verse లిస్టెడ్ కంపెనీ కాకపోయినా.. డెల్లాయిట్ తన FY 24 ఆర్థిక నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది.
కొన్ని ముఖ్యమైన విభాగాల్లో VerSe లో నియంత్రణలు సక్రమంగా లేవని, సప్లయిర్ల ఎంపిక, మదింపు, ఇన్‌వాయిస్ అనుమతులు, కొనుగోలు ఆర్డర్లు, చెల్లింపులపై పర్యవేక్షణ వంటి వాటిలో లోపాలున్నాయని డెల్లాయిట్ రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్‌కు ఇచ్చిన ఆడిట్ నివేదికలో తెలిపింది.
16వేల కోట్ల ఫండింగ్.
VerSe Innovation ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు డైలీ హంట్, జోష్ సంస్థలకు మాతృసంస్థ. 2007 లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ 2 బిలియన్ డాలర్లు ( షుమారు 16వేల కోట్లకు పైగా) ఫండింగ్‌ను ఆ సంస్థ సమీకరించింది. ఈ కంపెనీలో కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ CPPIB, ఓంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, జేమ్స్ ముర్డోక్ లూపా సిస్టమ్స్, Z47( పూర్వపు మాట్రిక్స్ పార్ట్నర్స్) వంటి వాళ్లు కీలకమైన పెట్టుబడిదారులుగా ఉన్నారు. 2022 లో CPPIB నుంచి 8౦5 మిలియన్ డాలర్లు పెట్టుబడి వచ్చాక కంపెనీ విలువ అమాంతం పెరిగిపోయి దాదాపు 40వేల కోట్లకు చేరుకుంది. సంస్థలో అంతర్గతంగా ఉన్న లోపాల గురించి ఆడిటింగ్ సంస్థ తమ ప్రతీ నివేదికలో ప్రస్తావిస్తూనే ఉంది.
నిర్వహణను మెరుగుపరుస్తాం- VerSe
అంతర్గత నిర్వహణ లోపాలను మెరుగు పరుస్తామని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. “అత్యుత్తమ విధానాలపై పూర్తిస్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించామని.. లోపాలను సవరించడానికి చెక్‌లిస్టులను కూడా పెట్టామని” ఆ సంస్థ తెలిపింది. సంస్థాగతంగా ఉన్న లోపాలను గుర్తించడానికి అన్ని చర్యలను తీసుకుంటున్నామని .. వీటికి అదనంగా... సప్లయిర్ల ఎంపిక, అనుమతులు, ఇన్‌వాయిస్‌లు, చెల్లింపులను పారదర్శకంగా చేసేందుకు సమగ్రమైన Otder to Cash విధానాన్ని తీసుకొస్తున్నామని వెర్స్ పేర్కొంది. ఇది డెలిగేషన్ ఆఫ్ అథారిటీ DOA కి అనుగుణంగా ఉంటుందని చెప్పింది.
ఇన్నిరకాలైన నిర్వహణాపరమైన లోపాలున్నప్పటికీ .. ఈ సమస్యలు VerSe కన్సాలిడేటెడ్ ఆర్థిక నివేదికలు క్లీన్ అన్న తమ అభిప్రాయంలో మార్పు లేదని డెల్లాయిట్ తమ ఆడిట్ నివేదికలో స్పష్టం చేసింది.
“VerSe Innovation కి చాలా కాలంగా ఆడిటింగ్ సంస్థగా ఉన్న Deloitte మా FY24 ఆర్థిక నివేదికలపై చాలా వాస్తవమైన, నిస్పాక్షికమైన నివేదిక ఇచ్చింది. ఈ ఏడాది మా ఆర్థిక నివేదికలపై క్లీన్ ఓపీనియన్ ఇచ్చింది. అంతర్గత నియంత్రణలపై ప్రతికూల కామెంట్లు చేసినప్పటికీ మా ఫైనల్ అకౌంట్లపై వాటి ప్రభావం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. అది వాస్తవం అని” Verse ఓ ప్రకటనలో చెప్పింది.