Unauthorized Forex Trading Platforms: యూట్యూబ్‌ సహా సోషల్‌ మీడియా పేజీలు ఓపెన్‌ చేస్తే చాలు... చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు తెరపై కనిపిస్తుంటారు. స్టాక్‌ మార్కెట్‌లో మేం ఇంత సంపాదించాం, అంత సంపాదించాం అంటూ ఊదరగొడుతుంటారు. మార్కెట్‌లో డబ్బు బాగా సంపాదించాలంటే తాము చెప్పిన స్టాక్స్‌ కొనాలని, తమ ఫ్లాట్‌ఫామ్స్‌లో ట్రేడ్‌ చేయాలంటూ కొన్ని పేర్లు సూచిస్తుంటారు. ఇలాంటి ప్రకటనలు ఇచ్చే చాలా వెబ్‌సైట్లు లేదా యాప్స్‌ ఫేక్‌ లేదా అనాథరైజ్డ్‌.


రిజర్వ్ బ్యాంక్, బుధవారం నాడు, అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌ ‍‌(unauthorized forex trading platforms) గురించి ట్రేడర్లు, ఇన్వెస్టర్లను మరోమారు అలెర్ట్‌ చేసింది. 'అలర్ట్ లిస్ట్'ను అప్‌డేట్ చేసింది. ఈ లిస్ట్‌ను చాలా కాలం నుంచి RBI కొనసాగిస్తోంది. తాజాగా, మరో ఎనిమిది ఎంటిటీలను ఇందులోకి యాడ్‌ చేసింది. దీంతో, అనాథరైడ్డ్‌ ఫాట్‌ఫామ్స్‌ సంఖ్య 56కు చేరుకుంది. అనాథరైజ్డ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ అంటే రిజిస్టర్‌ కాని సంస్థలు. ఇవి, రిజర్వ్‌ బ్యాంక్‌ పరిధిలోకి రాకుండా యాక్టివిటీస్‌ కొనసాగిస్తూ ఇన్వెస్టర్లు, ట్రేడర్లను మోసం చేస్తున్నాయి. 


గత ఏడాది సెప్టెంబర్‌లో, సెంట్రల్ బ్యాంక్, అనధికార ఫారెక్స్ ట్రేడింగ్ 'అలర్ట్ లిస్ట్'ను విడుదల చేసింది. అప్పుడు 34 ఎంటిటీల పేర్లతో ఆ లిస్ట్‌ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఈ లిస్ట్‌ను అప్‌డేట్‌ చేసింది. ఇప్పుడు ఈ జాబితాలో 56 ఎంట్రీలు ఉన్నాయి.


బుధవారం రిజర్వ్‌ బ్యాంక్‌ యాడ్‌ చేసిన 8 అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌:


క్యూఎఫ్‌ఎక్స్ మార్కెట్స్ - QFX Markets - https://qfxmarkets.com/
విన్‌ట్రేడ్ - WinTrade - https://www.2wintrade.com/
గురు ట్రేడ్7 లిమిటెడ్ - Guru Trade7 Limited - https://www.gurutrade7.com/
బ్రిక్ ట్రేడ్ - Bric Trade - https://www.brictrade.com/
రూబిక్ ట్రేడ్ - Rubik Trade - https://www.rubiktrade.com/
డ్రీమ్ ట్రేడ్ - Dream Trade - Mobile Application
మినీ ట్రేడ్ - Mini Trade - Mobile Application
ట్రస్ట్ ట్రేడ్ - Trust Trade -  Mobile Application


రిజర్వ్‌ బ్యాంక్‌ పర్మిషన్ ఉన్న అధీకృత వ్యక్తులు/అధీకృత ETPల ‍‌(Electronic Trading Platform) లిస్ట్‌ ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉందుబాటులో ఉంటుంది. మీరు ట్రేడ్‌ చేస్తున్న ఫ్లాట్‌ఫామ్‌కు గుర్తింపు ఉందో, లేదో ఆ లిస్ట్‌ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.


ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అనుమతి లేని ఫారెక్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఉద్దేశపూర్వకంగా కార్యకలాపాలు చేసినట్లు RBI గుర్తిస్తే, FEMA నిబంధనల చర్యలు తీసుకుంటుంది.


మరో ఆసక్తికర కథనం: 'పపర్‌' తగ్గిన ఐఈఎక్స్‌, రెండ్రోజుల్లో 23% ఆవిరి - ఏం జరుగుతోంది? 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.