Umang App: ప్రభుత్వ సేవలను పౌరులు అత్యంత సులభంగా అందుకొనేందుకు కేంద్రం రూపొందించిన యాప్‌ ఉమాంగ్‌ (UMANG). ఈ మొబైల్‌ అప్లికేషన్‌తో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల సేవలను సునాయాసంగా యాక్సెస్‌ చేసుకోవచ్చు. ప్రావిడెంట్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. అవసరమైతే విత్‌ డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు ఆధార్‌ సర్వీసులను ఇంటి వద్దే పొందొచ్చు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధార్‌కు సంబంధించి మరో నాలుగు సేవలను ఉమాంగ్‌లో ప్రవేశపెట్టింది.




'ఉమాంగ్‌ యాప్‌లోని మై ఆధార్‌ సెక్షన్లో మరికొన్ని పౌర ఆధారిత సేవలను జత చేశాం. మరింత సమాచారం కోసం ఉమాంగ్‌ యాప్‌ను వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోండి. 97183-97183కి మిస్డ్‌ కాల్‌ ఇవ్వండి' అని ఉమాంగ్‌ యాప్‌ ఇండియా ట్విటర్లో పోస్టు చేసింది.


ఆధార్‌ సరికొత్త సేవలు


* వెరిఫై ఆధార్: ఈ సేవతో యూజర్లు తమ ఆధార్‌ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
* ఎన్‌రోల్‌మెంట్‌ తనిఖీ లేదా అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ తనిఖీ చేసుకోవచ్చు.
* ఆధార్‌తో నమోదైన మొబైల్‌, ఈ-మెయిల్‌ను తనిఖీ చేసుకోవచ్చు.
* రీట్రైవ్‌ ఈఐడీ/ ఆధార్‌ నంబర్‌: ఆధార్‌ సంఖ్య లేదా ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ (EID) తనిఖీ చేసుకోవచ్చు.


ఉమాంగ్‌లోని ఆధార్‌ సేవలు పొందడం అత్యంత సులువు. ఇందుకోసం యూజర్లు ఆధార్‌లో నమోదు చేసిన మొబైల్‌ నంబర్‌తో ఉమాంగ్‌ యాప్‌లో లాగిన్‌ అవ్వాలి. అప్పుడే ఆధార్‌ డౌన్‌లోడ్‌, వర్చువల్‌ ఐడీ సృష్టించడం, అథెంటికేషన్‌ హిస్టరీ పొందడం, ఆఫ్‌లైన్‌ ఈ-కేవైసీ, పేమెంట్‌ హిస్టరీ అలాక్‌, అన్‌లాక్‌ బయోమెట్రిక్‌ను పొందేందుకు వీలవుతుంది.


ఉమాంగ్‌ యాప్‌ లాగిన్‌ ప్రక్రియ


Step 1: ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నాక ఉమాంగ్‌ యాప్‌లో లాగిన్‌ అవ్వాలి.
Step 2: మై ఆధార్‌పై క్లిక్‌ చేయాలి.
Step 3: ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతుంది.
Step 4: ఆధార్‌ నంబర్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేశాక ఓటీపీ సెండ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
Step 5: ఓటీపీ ఎంటర్‌ చేశాక సేవ్‌పై క్లిక్‌ చేయాలి.


ఉమాంగ్‌లో ఆధార్‌ను అనుసంధానం చేశాక సులభంగా ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వర్చువల్‌ ఐడీ సృష్టించడం, ఇతర సర్వీసులు పొందడం వీలవుతుంది.