Donald Trump announces 25 percent tariffs on India starting August 1st: భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ లేనట్లేనని తేలిపోయింది. ఆగస్టు ఒకటో తేదీ లోపు డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ షరతులు పెట్టారు. కానీ ఏపక్ష అమెరికా డిమాండ్ల కారణంగా ఇంకా డీల్ కుదుర్చుకోలేదు. ట్రంప్ పెట్టిన ఆగస్టు 1 డెడ్ లైన్ ముంచుకు రావడంతో.. ట్రంప్ టారిఫ్‌లు ప్రకటించారు.  భారతదేశం మా మిత్రదేశం అయినప్పటికీ  వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ కారణంగా వారితో తక్కువగా వ్యాపారం చేశామన్నారు. 

ఇండియాలో అమెరికా వస్తువులపై పన్నులు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయన్నారు. అలాగే  భారత్ ఎల్లప్పుడూ   రష్యా నుండి ఆయుధాలు కొనుగోలు చేస్తోందని ఆరోపించారు.  ఉక్రెయిన్‌లో హత్యలను రష్యా ఆపాలని అందరూ కోరుకుంటున్న సమయంలో, చైనాతో పాటు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయన్నారు. ఇవి మంచివి కావని..  అందువల్ల భారతదేశం ఆగస్టు 1 నుండి 25 శాతం పన్నులు విధఇస్తున్నామని.. దీనికి అదనం  పెనాల్టీ వేస్తున్నామన్నారు. 

 2023లో భారతదేశం అమెరికాకు రూ. 87 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేసింది, ఇందులో ఫార్మాస్యూటికల్స్, కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ ,  దుస్తులు ప్రధానమైనవి. ఈ  టారిఫ్‌ల వల్ల భారతదేశం సంవత్సరానికి రూ. 7 బిలియన్ నష్టపోవచ్చని వ్యాపారవర్గాల అంచనా.   దేశం  మొత్తం ఎగుమతులలో 87 శాతం  ఈ టారిఫ్‌ల ప్రభావానికి గురవుతాయని చెబుతున్నారు. గత ఏప్రిల్లో టారిఫ్‌లు విధించిన తర్వాత  ట్రేడ్ డీల్ కోసం వాయిదా వేశారు.  ఫిబ్రవరి లో మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో , భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైట్ హౌస్‌ లో 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూ. 500 బిలియన్‌కు రెట్టింపు చేయాలనే లక్ష్యంతో చర్చలు జరిపారు.  

ట్రేడ్ డీల్ కోసం జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి రాలేదు. నిజానికి చాలా అంశాలపై స్పష్టత వచ్చినప్పటికీ నాన్ వెజ్ మిల్క్ విషయంలో రెండు దేేశాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు.  అమెరికాలో ఆవులకు నాన్ వెజ్ వ్యవస్థలు పెట్టి పోషిస్తారు. వాటి నుంచి వచ్చే పాలను నాన్ వెజ్ మిల్క్ అంటారు. వాటికి ఇప్పటి వరకూ  భారత్ లోకి అనుమతి లేదు. భారత్ లో పాలు..  ఆధ్యాత్మకతకు సంబంధించిన అంశం కూడా. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డెయిరీ రంగంలోకి  అమెరికా  ఉత్పత్తుల్ని అనుమతించాల్సిందేనని పట్టుబడుతోంది.  అక్కడే ట్రేడ్ డీల్ ఆగిపోయింది.  తదుపరి ఏమైనా చర్చలు జరుగుతాయా.. ఇక భారత్ ప్రత్యామ్నాయాలను చూసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.