June Rules :  జూన్ నెల వచ్చేసింది. అయితే ఎప్పటిలాగే నెల మారింది కదా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ నెల నుంచి ఆర్థిక విషయాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. వాటి గురించి తెలుసుకుంటే రూపాయి ఆదా చేసుకోవడమో.. రూపాయి నష్టపోకుండా ఉండటమో చేసుకోవచ్చు. అవి ఏమిటంటే 


ఇంటి రుణాల వడ్డీ రేట్లు పెంచిన స్టే ట్ బ్యాంక్ 
  
దేశంలోకెల్లా అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంక్  భార‌తీయ స్టేట్ బ్యాంక్ ( SBI ) ఇంటి రుణాల‌ ( Home Loans ) పై వ‌డ్డీరేట్  40 బేసిక్ పాయింట్లు పెంచేసింది. దీంతో ఈబీఎల్ఆర్ 7.05 శాతానికి పెరిగింది. ఇక రెపోరేట్ లింక్డ్ లోన్ రేట్ ( RLLR ) 6.65 శాతం ప్ల‌స్ సీఆర్పీ చెల్లించాల్సి ఉంటుంది. జూన్ ఒక‌టో తేదీ నుంచి స‌వ‌రించిన వ‌డ్డీరేట్లు అమ‌ల్లోకి వ‌స్తాయి.


పోస్ట్ బ్యాంక్‌లో ఇక నుంచి చార్జీలు 


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ( IPPB )లో ఆధార్ అనుబంధ చెల్లింపుల వ్య‌వ‌స్థ ( AEPS ‌) కింద చార్జీలు ఖ‌రార‌య్యాయి. ఈ చార్జీలు జూన్ 15 నుంచి అమ‌ల‌వుతాయి. ప్ర‌తి నెటా ఆధార్ అనుబంధ చెల్లింపుల వ్య‌వ‌స్థ ద్వారా తొలి మూడుసార్లు చెల్లింపులు ఉచితం. త‌దుప‌రి ప్ర‌తి న‌గ‌దు డిపాజిట్ లేదా విత్ డ్రాయ‌ల్‌పై రూ.20 + జీఎస్టీ ( GST ) చెల్లించాల్సిందే. మినీ స్టేట్‌మెంట్ కావాలంటే రూ.5తోపాటు జీఎస్టీ పే చేయాలి.


బంగారంపై హాల్ మార్క్ తప్పనిసరి !
 
బంగారం ఆభ‌ర‌ణాల‌పై రెండో ద‌శ హాల్‌ మార్కింగ్ ( Hall mark ) ప్ర‌క్రియ జూన్ ఒక‌టో తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్న‌ది. తొలిద‌శ‌లో 256 జిల్లాల‌తోపాటు 32 కొత్త జిల్లాల్లో ఈ విధానం అమ‌ల్లోకి వ‌స్తుంది. 14 క్యార‌ట్లు, 18, 20, 22, 23, 24 క్యార‌ట్ల బంగారం ఆభ‌ర‌ణాల‌పై త‌ప్ప‌నిస‌రిగా హాల్‌మార్కింగ్ చేయాల్సిందే.


వాహనాల బీమా ప్రీమియం పెంపు ! 


కారు బీమా ప్రీమియంను కూడా సవరించారు. అంటే పెంచారు.  30కిలోవాట్ల ( KW ) సామ‌ర్థ్యం లోపు విద్యుత్ వాహ‌నంపై మూడేండ్ల బీమా ప్రీమియం రూ.5,543, 65 కేడ‌బ్ల్యూ కెపాసిటీ గ‌ల వెహిక‌ల్స్‌పై మూడేండ్ల ప్రీమియం రూ.9,044గా నిర్ణ‌యించారు. 65కేడ‌బ్ల్యూ కంటే ఎక్కువ సామ‌ర్థ్యం గ‌ల వాహ‌నాల‌పై బీమా ప్రీమియం మూడేండ్ల‌కు రూ.20,907 ఖ‌రారు చేశారు. జూన్ ఒక‌టో తేదీ నుంచి ఈ నిబంధ‌న అమ‌ల్లోకి వ‌స్తున్న‌ది.