TCS shares: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) CEO పదవికి రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేసినట్లు గురువారం (16 మార్చి 2023) సాయంత్రం ఆ కంపెనీ ప్రకటించి, మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. గోపీనాథన్‌ స్థానంలో  కె.కృతివాసన్‌ను తదుపరి సీఈవోగా తక్షణం నియమించింది. CEO పదవికి రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేసినా, ఈ ఏడాది సెప్టెంబరు 15 వరకు అదే హోదాలో కొనసాగుతారు. CEO పీఠంపై కృతివాసన్‌ నిలదొక్కుకునేలా సూచనలు చేస్తారు. నాయకత్వ మార్పు సాఫీగా జరిగేలా చూస్తారు. 


ప్రతికూలంగా స్పందించిన మార్కెట్‌
రాజేష్ గోపీనాథన్ హఠాత్‌ రాజీనామాతో మార్కెట్‌ ప్రతికూలంగా ఆశ్చర్యపడింది. ఇవాళ (శుక్రవారం, 17 మార్చి 2023), సహచర IT స్టాక్స్‌ లాభాల్లో ఉంటే TCS షేర్‌ మాత్రం డీలా పడింది. 1% పైగా నష్టపోయి రూ. 3,144 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. ఉదయం 11.25 గంటల సమయానికి 0.41% లేదా రూ. 12.95 నష్టంతో రూ. 3,172 వద్ద కదులుతోంది.


నాయకత్వ మార్పు జరిగినప్పటికీ, కంపెనీ వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని, సమీప కాలంలో షేర్‌ ధర తగ్గితే పోర్టిఫోలియోలకు యాడ్‌ చేసుకోమని బ్రోకరేజీలు సూచిస్తున్నాయి.


"1968లో ప్రారంభమైనప్పటి నుంచి, 55 సంవత్సరాల TCS చరిత్రలో కృతివాసన్‌ కేవలం ఐదో CEO మాత్రమే. కంపెనీ నిర్వహణలో స్థిరత్వం, నాణ్యతకు ఇది నిదర్శనం. నాయకత్వ మార్పు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు" - నువామా ఎనలిస్ట్‌ విభోర్ సింఘాల్


గోపీనాథన్ నాయకత్వంలో, FY18–23 కాలంలో 13%/11% CAGR వద్ద ఆదాయాలు/లాభాలను TCS అందించింది. గత ఆరేళ్ల అతని పదవీకాలంలో TCS స్టాక్ 18% CAGR వద్ద పెరిగింది లేదా 160% ర్యాలీ చేసింది.


TCS CEO రాజేష్ గోపీనాథన్ రాజీనామా తర్వాత, అగ్ర బ్రోకరేజీలు ఇచ్చిన రేటింగ్స్‌ ఇవి:


కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్  |  యాడ్‌  |  టార్గెట్‌ ధర: రూ. 2,500      


మోతీలాల్ ఓస్వాల్  |  బయ్‌ |   టార్గెట్‌ ధర: రూ. 3,810         


JP మోర్గాన్  |  అండర్‌వెయిట్‌  |   టార్గెట్‌ ధర: రూ. 3,000          


సిటీ బ్యాంక్  |  సెల్‌  |   టార్గెట్‌ ధర: రూ. 2,990     


CLSA   |  ఓవర్‌వెయిట్‌  |   టార్గెట్‌ ధర: రూ. 3,550         


మోర్గాన్ స్టాన్లీ  | ఈక్వల్‌ వెయిట్‌  |   టార్గెట్‌ ధర: రూ. 3,350     


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.