Suzlon Energy Shares: ఇవాళ్టి (సోమవారం, 03 జూన్ 2023) ట్రేడింగ్‌లో, BSEలో, సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 10% అప్పర్ సర్క్యూట్ కొట్టాయి, రూ. 16.86 వద్ద లాక్ అయ్యాయి. స్టాక్ సెంటిమెంట్ చాలా బలంగా ఉండడంతో వరుసగా ఆరో సెషన్‌లోనూ విన్నింగ్ రన్ కొనసాగింది.
గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 24% పెరిగాయి.
శుక్రవారం నాటి క్లోజింగ్ ప్రైస్ రూ. 15.33తో పోలిస్తే, ఈ ఎనర్జీ షేర్లు ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు 10% పెరిగి రూ. 9.98 వద్ద అప్పర్ సర్క్యూట్‌లో ఆగాయి.
ఈ స్టాక్ గత నెల రోజుల్లోనే 47% పైగా పెరిగింది. ఈ ఆరు నెలల్లో 57%, గత ఒక ఏడాది కాలంలో 175% పైగా ర్యాలీ చేసింది.
బయ్ రేటింగ్, రూ.22 టార్గెట్ ప్రైస్
ఇండస్ట్రీ టెయిల్‌విండ్స్ నుంచి లాభపడే కంపెనీల్లో సుజ్లాన్ ఎనర్జీ బెస్ట్ ప్లేస్‌లో ఉందని దేశీయ బ్రోకరేజ్ కంపెనీ ICICI సెక్యూరిటీస్ చెబుతోంది. రెడ్ బుల్ తాగితే రెక్కలొచ్చినట్లు, FY24 నుంచి సుజ్లాన్ ఎనర్జీ ఆదాయాలకు కూడా రెక్కలు వస్తాయని ఆశిస్తోంది.
ICICI సెక్యూరిటీస్ సుజ్లాన్ ఎనర్జీకి రూ. 22 టార్గెట్ ప్రైస్‌తో "బయ్" రేటింగ్ ఇచ్చింది. ఈ టార్గెట్ ప్రైస్, ప్రస్తుత మార్కెట్ ధర కంటే 32% ర్యాలీని సూచిస్తోంది.
పుణె కేంద్రంగా పని చేసే సుజ్లాన్ ఎనర్జీ, విండ్ టర్బైన్లను రూపొందిస్తుంది. వాటిని ఇండియన్ మార్కెట్‌లో అమ్మడంతో పాటు వివిధ దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ, ప్రపంచంలో ఐదో అతి పెద్ద విండ్ టర్బైన్స్ సప్లయర్.
ఇండియన్ పవర్ సెక్టార్‌కు మరింత విండ్ పవర్ అవసరం. కెపాసిటీని పెంచాల్సిన పని చివరకు స్టేక్‌హోల్డర్స్‌పై పడింది. ఈ పరిస్థితులను సుజ్లాన్ ఎనర్జీ క్యాష్ చేసుకుంటుందని ICICI సెక్యూరిటీస్ ఆశిస్తోంది.
కంపెనీ లాభనష్టాలు
Q4FY23లో (2023 జనవరి-మార్చి కాలం), కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 320 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో రూ. 205.52 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. FY22లో రూ. 258 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. FY23లో రూ. 2,852 కోట్ల నికర లాభం సాధించింది.
అయితే, మార్చి త్రైమాసికంలో ఆదాయం తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలోని ఆదాయం రూ. 2478 కోట్లతో పోలిస్తే 31% తగ్గి రూ. 1700 కోట్లకు చేరుకుంది. మొత్తం FY23లోనూ ఆదాయం 9% తగ్గి రూ. 5990 కోట్లకు చేరుకుంది.
మరో ఆసక్తికర కథనం: కేవలం ₹100కే రైల్వే స్టేషన్‌లో రూమ్ - హోటల్ గదిలా ఉంటుంది
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial