Value Buys: దలాల్ స్ట్రీట్‌ నుంచి మంచి లాభం సంపాదించాలంటే "వాల్యూ బయ్‌" చేయాలి. వాల్యూ బయ్స్‌ అనదగ్గ స్టాక్స్‌ను వెతికి పట్టుకోవాలి. "వాల్యూ బయ్స్‌" అంటే, వాస్తవంగా ఉండాల్సిన విలువ ‍‌(Valuation) కంటే తక్కువ విలువ దగ్గర ట్రేడవుతున్న క్వాలిటీ స్టాక్స్‌. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, చౌకగా దొరుకుతున్న క్వాలిటీ స్టాక్స్‌.
 
మన స్టాక్‌ మార్కెట్లు గత రెండేళ్లుగా ఒక రేంజ్‌ బౌండ్‌లో తిరుగుతున్నాయి. దీంతో, కొన్ని మంచి స్టాక్స్‌ వాటి 5-సంవత్సరాలు & 10-సంవత్సరాల చారిత్రక సగటు PE కంటే తక్కువ విలువలోకి పడిపోయాయి. ప్రస్తుతం, నిఫ్టీ50 ఇండెక్స్‌లోని దాదాపు సగం కౌంటర్లు వాటి 10 సంవత్సరాల సగటు PE కంటే తక్కువలో, చౌకగా దొరుకుతున్నాయి. వీటి దీర్ఘకాలం కోసం ఎంచుకుంటే, పెట్టుబడిదార్లకు మంచి రాబడిని అందించే అవకాశం ఉంది.

ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, ఈ కింద చెప్పిన 20 స్టాక్స్‌కు 5% నుంచి 35% వరకు అప్‌సైడ్ స్కోప్‌ ఉంది. మార్కెట్‌ ఎనలిస్ట్‌లు వీటికి "స్ట్రాంగ్‌ బయ్‌" నుంచి "హోల్డ్" వరకు రేటింగ్స్‌ ఇచ్చారు.

UPL షేర్లను ఉదాహరణగా తీసుకుంటే, దీని సగటు టార్గెట్‌ ప్రైస్‌ను 35%కు ఎనలిస్ట్‌లు పెంచారు. ఈ స్టాక్‌కు ఉన్న 23 కాల్స్‌లో... 17 స్ట్రాంగ్‌ బయ్‌ రేటింగ్స్‌, 3 బయ్‌ రేటింగ్స్‌, 2 హోల్డ్ కాల్స్‌, ఒక సెల్ సిఫార్సు ఉన్నాయి. ఈ స్టాక్‌ గత 10 సంవత్సరాల సగటు PE 17.32 రెట్లుగా ఉంటే, గత 12 నెలల (TTM) PE 14.03 రెట్లుగా ఉంది. అంటే, గత పదేళ్ల సగటు PE కన్నా చౌకగా దొరుకుతోంది. బ్రోకరేజ్‌ ప్రభుదాస్‌ లీలాధర్‌ దీనికి రూ. 850 టార్గెట్‌ ప్రైస్‌ను ప్రకటించింది.

హిందాల్కో విషయానికి వస్తే... దీని పదేళ్ల సగటు PE 12.52 రెట్లుతో పోలిస్తే, TTM PE 7.92 రెట్లుగా ఉంది. అంటే, ఈ స్టాక్‌ కూడా ప్రస్తుతం చౌక ధరకే అందుబాటులో ఉంది. బుధవారం నాడు Q4 ఆదాయాలను ప్రకటించిన ఈ స్టాక్‌ను 20 ఎనలిస్ట్‌లు ట్రాక్‌ చేస్తున్నారు. వారిలో 14 మంది స్ట్రాంగ్‌ బయ్‌ సిఫార్సు చేయగా, మిగిలిన వాళ్లంతా బయ్‌ రేటింగ్‌ ఇచ్చారు. సెల్‌ కాల్స్‌ లేవు. ఎనలిస్ట్‌లు ఇచ్చిన టార్గెట్‌ ప్రైస్‌ ప్రకారం ఇది మరో 30% ర్యాలీ చేయగలదని ట్రెండ్‌లైన్ డేటా సూచిస్తోంది.

చౌకగా దొరుకుతున్న 20 స్టాక్స్‌:

స్టాక్‌ పేరు 12 TTM PE పదేళ్ల సగటు PE ఏడాదిలో ఎంత పెరగొచ్చు? (%)
UPL   14.03   17.32    35 
హిందాల్కో 7.92 12.52 30
HDFC బ్యాంక్‌ 20.01 23.09 24
SBI 9.22 116.96 23
యాక్సిస్‌ బ్యాంక్‌
26.31 51.29 21
M&M 15.86 39.99 21
ICICI బ్యాంక్ 19.61 21.75 20
HDFC 19.11 20.17 19
NTPC 9.70 9.78 17
అపోలో హాస్పిటల్స్ 83.52 86.11 15
ఇండస్ఇండ్ బ్యాంక్ 13.01 22.74 14
సిప్లా 26.39 30.89 13
భారతి ఎయిర్‌టెల్ 57.59 75.44 11
కోటక్ మహీంద్ర బ్యాంక్ 25.83 30.89 11
డా.రెడ్డీస్ ల్యాబ్స్ 16.22 28.24 10
ONGC 4.90 9.69 10
గ్రాసిమ్ 13.71 17.44 8
కోల్ ఇండియా 5.25 12.38 6
ఐషర్ మోటార్స్ 33.54 38.28 6
పవర్‌ గ్రిడ్‌  10.75 11.31 5

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.