Share Market Closing Today: మార్కెట్‌లో ఎనర్జీ నింపిన బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్‌ - మరో ఆల్‌టైమ్‌ హైలో సెన్సెక్స్, నిఫ్టీ

Stock Markets At Record Levels: ట్రేడింగ్‌ చివరిలో ఇన్వెస్టర్ల కొనుగోళ్ల కారణంగా స్టాక్‌ మార్కెట్‌ ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి అద్భుతంగా పుంజుకుంది. ఈ క్రెడిట్ బ్యాంకింగ్, ఇంధన రంగాలకు వెళుతుంది.

Continues below advertisement

Stock Market Closing On 25 September 2024: భారతీయ స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన సూచీలు BSE సెన్సెక్స్ - NSE నిఫ్టీ రెండూ మళ్లీ సరికొత్త ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. ఈ రోజు (బుధవారం, 25 సెప్టెంబర్ 2024‌) ట్రేడింగ్ సెషన్‌లో, BSE సెన్సెక్స్ 85,247.42 వద్ద (Nifty at fresh all-time high) కొత్త ఆల్‌ టైమ్‌ హైని & NSE నిఫ్టీ 26032.80 పాయింట్ల వద్ద (Nifty at fresh all-time high) కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. 

Continues below advertisement

నేటి సెషన్‌లో మార్కెట్ దిగువ స్థాయిల నుంచి గట్టి రికవరీని చూపింది. సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి 500 పాయింట్లు, నిఫ్టీ 161 పాయింట్ల మేర కోలుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 256 పాయింట్ల జంప్‌తో 85,170 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల జంప్‌తో 26,000 ఎగువన 26,004 వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్‌ కీలకమైన 85,000 పైన & నిఫ్టీ 26,000 పైన క్లోజ్‌ కావడం ఇదే తొలిసారి. 

ఈ రోజు ఉదయం సెన్సెక్స్‌ 84,836.45 దగ్గర, నిఫ్టీ 25,899.45 దగ్గర ఓపెన్‌ అయ్యాయి. రోజు మొత్తం స్వల్ప నష్టాల్లోనే నడిచాయి. అయితే, చివరి అరగంటలో వచ్చిన కొనుగోళ్లు ఈ ప్రధాన సూచీలను కొత్త గరిష్టాల వైపు తీసుకెళ్లాయి.

పెరిగిన & పడిపోయిన షేర్లు 
నేటి ట్రేడింగ్‌లో పవర్ గ్రిడ్ 3.91 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.18 శాతం, ఎన్‌టీపీసీ 1.94 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.10 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.91 శాతం, టాటా స్టీల్ 0.65 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.59 శాతం లాభపడ్డాయి. మరోవైపు... టెక్ మహీంద్రా 2.21 శాతం, టాటా మోటార్స్ 1.39 శాతం, టైటాన్ 0.93 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.92 శాతం, ఎస్‌బీఐ 0.68 శాతం, అదానీ పోర్ట్స్ 0.43 శాతం చొప్పున పతనమయ్యాయి.   

సెక్టార్ల పెర్ఫార్మెన్స్‌
నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఫార్మా, మెటల్స్, రియల్ ఎస్టేట్, మీడియా, ఇంధనం, ఇన్‌ఫ్రా రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ఆటో, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, హెల్త్‌కేర్‌ రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే.. కూడా మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్ సూచీలు జోరు చూపకపోవడంతో నిఫ్టీ మిడ్‌ క్యాప్, నిఫ్టీ స్మాల్‌ క్యాప్ సూచీలు నష్టపోయాయి. ఇండియా విక్స్ 8.22 శాతం పతనంతో 12.28 వద్ద ముగిసింది. 

మార్కెట్ పెరిగినా మార్కెట్ క్యాప్ పడిపోయింది
సెన్సెక్స్ & నిఫ్టీ బలమైన పెరుగుదలతో ముగిసినప్పటికీ, మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌లో క్షీణత కారణంగా స్టాక్ మార్కెట్ విలువ ఈ రోజు తగ్గింది. బీఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 475.24 లక్షల కోట్ల వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో ఇది రూ.476.07 లక్షల కోట్ల వద్ద ఉంది. అంటే, నేటి సెషన్‌లో మార్కెట్ క్యాప్ రూ.81000 కోట్లు తగ్గింది.   

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఈ తప్పుల వల్ల మీ ఈపీఎఫ్‌ క్లెయిమ్ రిజెక్ట్‌ అవుతుంది, అవసరానికి డబ్బు అందదు

Continues below advertisement
Sponsored Links by Taboola