Stock Market Closing Bell on 31 May 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆరంభం నుంచే మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఆసియా మార్కెట్లు నష్టాల్లో మొదలవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఐరోపా, ఆసియా సూచీలు సపోర్ట్ తీసుకోవడంతో భారత మార్కెట్లు రాణిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,584 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 359 పాయింట్ల నష్టాల్లో ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 55,925 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,622 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. ఆరంభం నుంచే అమ్మకాల జోరు కనిపించింది. 55,369 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,925 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 359 పాయింట్ల నష్టంతో 55,566 వద్ద కొనసాగుతోంది. ఒకానొక దశలో లాభాల్లోకి వచ్చిన సూచీ ఆఖరి అరగంటలో పతనమైంది.
NSE Nifty
సోమవారం 16,661 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,578 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే నష్టాల్లో ఉంది. 16,521 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,690 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తానికి 76 పాయింట్ల నష్టంతో 16,584 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ముగిసింది. ఉదయం 35,615 వద్ద మొదలైంది. 35,288 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,881 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 339 పాయింట్ల నష్టంతో 35,487 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం, కోల్ ఇండియా, టాటా కన్జూమర్ షేర్లు లాభపడ్డాయి. కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, శ్రీసెమ్ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్, స్మాల్ క్యాప్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్, రియాల్టీ సూచీలు ఎగిశాయి. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్స్, ఐటీ, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జూమర్ డ్యురబుల్స్‌లో సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది.