Stock Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో బెంచ్‌మార్క్ సూచీలు భారీగా లాభపడ్డాయి. ధరల పెరుగుదల, అమెరికా ఫెడ్‌రేట్ల పెంపు మదుపర్లలో నెగెటివ్ సెంటిమెంటును పెంచాయి. ఆఖర్లో అమ్మకాల సెగ తగలడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,102 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 460 పాయింట్లు నష్టపోయింది. ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 57,521 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,817 వద్ద లాభాల్లో మొదలైంది. ఉదయం నుంచే దూకుడుగా ట్రేడ్ అయింది. 57,975 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. అలాంటి ఆఖర్లో ఒక్కసారిగా అమ్మకాలు పెరగడంతో 56,521 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 460 పాయింట్ల నష్టంతో 57,060 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 17,245 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,329 వద్ద ఓపెనైంది. కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఉదయం నుంచి సూచీ పై స్థాయిలో కదలాడింది. 17,377 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. ముగింపు సమయంలో అమ్మకాలు పెరగడంతో 17,953 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 142 పాయింట్ల లాభంతో 17,102 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ముగిసింది. ఉదయం 36,474 వద్ద మొదలైంది. 35,978 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,718 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 334 పాయింట్ల నష్టంతో 36,088 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభపడగా 38 నష్టాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా కన్జూమర్, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, విప్రో, ఓఎన్‌జీసీ నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్, పవర్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1-2 శాతం వరకు నష్టపోయాయి.