Indian Stock markets: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం జోష్‌లో ఉన్నాయి! ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు (UP election results)  మదుపర్లలో పాజిటివ్‌ సెంటిమెంటును పెంచాయి. పంజాబ్‌ మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ స్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడనుండటం ఇందుకు దోహదం చేసింది. వీటన్నిటినీ మినహాయిస్తే యుద్ధం తాలూకు భయాల నుంచి కాస్త తేరుకున్నట్టు కనిపిస్తోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1348, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 16,,730, నిఫ్టీ బ్యాంక్‌ 1498 పాయింట్ల లాభాల్లో ఉన్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 54,647 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 56,242 వద్ద మొదలైంది. భారీ గ్యాప్‌ అప్‌తో అదరగొట్టింది. 55,564 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ ఆ తర్వాత కొనుగోళ్ల ఊపుతో 56,242 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. ప్రస్తుతం 1350 పాయింట్ల లాభంతో 55,995 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


బుధవారం 16,345 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,757 వద్ద ఆరంభమైంది. మదుపర్లు విపరీతంగా కొనుగోళ్లు చేయడంతో దాదాపుగా 2.5 శాతం వరకు లాభాల్లో కొనసాగుతోంది. 16,593 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 16,757 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 387 పాయింట్ల లాభంతో 16,732 వద్ద కొనసాగుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంకు దూసుకుపోతోంది. 35,153 వద్ద మొదలైన సూచీ 34,716 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత బ్యాంకు షేర్లకు డిమాండ్‌ పెరగడంతో 35,374 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం 1510 పాయింట్ల లాభంతో 35,325 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Gainers and Lossers


నిఫ్టీలో 44 కంపెనీలు లాభాల్లో 6 నష్టాల్లో కదలాడుతున్నాయి. టాటా మోటార్స్‌ (Tata Motors), యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌  యూనీలివర్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 5-6 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. కోల్‌ఇండియా, హిందాల్కో, ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.