BSE500 Stocks: శుక్రవారం, (16 జూన్‌ 2023) బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ నిఫ్టీ ఆల్-టైమ్ హై లెవెల్స్‌కు కొంచెం దూరంలో ఆగిపోయింది. అయితే, మార్కెట్‌ ఊహించినదాని కంటే ఎక్కువ పాజిటివ్‌ డేటా అందించింది. ఈ వారంలో (సోమవారం-శుక్రవారం), 26 BSE500 స్టాక్స్‌ రెండంకెల రాబడిని తెచ్చిచ్చాయి. బ్రైట్‌కామ్ గ్రూప్ 27% లాభాలతో చార్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉంది. 26% గెయిన్స్‌తో ఓకార్డ్‌ (Wockhardt) సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. తాన్లా ప్లాట్‌ఫామ్స్‌, కళ్యాణ్ జ్యువెలర్స్, షీలా ఫోమ్, HEG, పాలీ మెడిక్యూర్, IDFC ఫస్ట్ బ్యాంక్‌ సహా దాదాపు 24 స్టాక్స్‌ 10-20% ప్రాఫిట్స్‌ చూపించాయి.


స్టాక్‌ పేరు                                    ఈ వారం గెయిన్స్‌


బ్రైట్‌కామ్ గ్రూప్ -                         27%
ఓకార్డ్‌ -                                         26%
తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ -                      19%
కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా -   19%
షీలా ఫోమ్ -                                 17%
HEG -                                          17%
పాలీ మెడిక్యూర్ -                       16%
మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ -        15%
PCBL -                                         15%
IDFC ఫస్ట్ బ్యాంక్ -                       14%
మిశ్ర ధాతు నిగమ్ -                     13%
అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ -              12%
L&T ఫైనాన్స్ హోల్డింగ్స్ -          12%
జూబిలెంట్ ఫార్మోవా -                 12%
లిండే ఇండియా -                        12%
నారాయణ హృదయాలయ -        12%
పతంజలి ఫుడ్స్ -                          12%
డిక్సన్ టెక్నాలజీస్ (ఇండియా) -  12%
గెలాక్సీ సర్ఫాక్టాంట్స్‌ -                   11%
మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ - 11%


స్మాల్‌ క్యాప్ ప్యాక్‌లో, 76 స్టాక్స్‌ రెండంకెల రాబడి ఇచ్చాయి. వీటిలో రెండు (జయ్ భారత్ మారుతి, మిష్టన్ ఫుడ్స్) 25% పైగా గెయిన్స్‌ ఆఫర్ చేశాయి. స్మాల్‌ క్యాప్స్‌లో 6 కౌంటర్లు 20-25% మధ్య లాభాలను అందుకున్నాయి.


గత వారంలో, సెన్సెక్స్‌ ఎక్కువ రోజుల్లో పాజిటివ్‌గా ఎండ్‌ అయింది, సెంటిమెంట్‌ను పదిలంగా ఉంచింది. గత వారంలో, టాటా స్టీల్ 4.91% వద్ద లాభాల్లో ముందంజలో ఉంది. ఏషియన్ పెయింట్స్ (4.24%), నెస్లే ఇండియా (4.01%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.77%) దాన్ని ఫాలో చేశాయి.


మరో ఆసక్తికర కథనం: నిఫ్టీని నడిపిస్తున్న 5 బ్లూ చిప్‌ స్టాక్స్‌, మీ దగ్గర ఒక్కటైనా ఉందా? 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.