Stock Market Closing bell:  భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) వరుసగా నష్టపోతున్నాయి. సోమవారం మదుపర్లను భయపెట్టిన మార్కెట్లు మంగళవారమూ అలాగే కొనసాగాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు లేకపోవడంతో విక్రయాలు వెల్లువ కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,958  వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 703 పాయింట్ల మేర నష్టపోయింది.


BSE Sensex


క్రితం సెషన్లో 57,166 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,381 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. ఉదయం నుంచి రేంజ్‌బౌండ్‌లోనే కొనసాగింది. 57,464 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. అయితే మార్కెట్ల ముగింపువేళ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. 57,009 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 703 పాయింట్ల నష్టంతో 56,463 వద్ద ముగిసింది.


NSE Nifty


సోమవారం 17,173 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,258 వద్ద ఓపెనైంది. ఉదయం 17,275 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం ఒక్కసారిగా పడిపోయి 16,824 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని  చేరుకుంది. చివరికి 215 పాయింట్ల నష్టంతో 14,958 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ 36,806 వద్ద మొదలైంది. 35,926 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,124 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 387 పాయింట్ల నష్టంతో 36,341 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 6 కంపెనీలు లాభపడగా 44 నష్టాల్లో ముగిశాయి. అపోలో హాస్పిటల్‌, కోల్ ఇండియా, రిలయన్స్‌, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా  కన్జూమర్స్‌ 4-6 శాతం వరకు నష్టపోయాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎరుపెక్కాయి. ఐటీ, పవర్‌, రియాల్టీ, ఎఫ్‌ఎంసీజీ 2 శాతం వరకు నష్టపోయాయి.