Stock Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం నష్టపోయాయి. ఆరంభంలో లాభాల్లోనే కదలాడిన సూచీలు సమయం గడిచే కొద్దీ నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లను ద్రవ్యోల్బణం భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. కంపెనీల ఖర్చులు పెరగడంతో మార్జిన్లు తగ్గుతున్నాయి. ఇదే ప్రభావం ఇండియన్ ఇన్వెస్టర్ల మీదా పడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,125 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 246 పాయింట్లు నష్టపోయింది.
BSE Sensex
క్రితం సెషన్లో 54,288 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 54,307 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. ఆద్యంతం రేంజ్‌బౌండ్‌లోనే కదలాడింది. 53,886 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,524 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 246 పాయింట్ల నష్టంతో 54,052 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 16,214 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16225 వద్ద ఓపెనైంది. ఆరంభంలో లాభపడ్డా ఆ తర్వాత ఒడుదొడుకులకు లోనైంది. 16,078 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,262 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 89 పాయింట్లు నష్టపోయి 16,125 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 34,223 వద్ద మొదలైంది. 34,115 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,586 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 42 పాయింట్ల లాభంతో 34,290 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ముగిశాయి. డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాపడ్డాయి. దివిస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, హిదుస్థాన్ యునీలివర్, హిందాల్కో నష్టపోయాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు పతనం అయ్యాయి. ఐటీ, ఫార్మా, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, పవర్, రియాల్టీ ఒక శాతం వరకు నష్టపోయాయి.