Stock Market Closing Bell:  భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం భారీగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవ్వడం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, చైనా లాక్‌డౌన్ల ప్రభావం సరఫరాపై తక్కువగా ఉండటం మదుపర్లలో సానుకూల సెంటిమెంటును పెంచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,200 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 776కి పైగా లాభాల్లో ముగిసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 56,579 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,066 వద్ద లాభాల్లో మొదలైంది. ఉదయం నుంచి జోరుగా సాగింది. 56,904 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది.  ఐరోపా మార్కెట్లు తెరుచుకున్న తర్వాత కొనుగోళ్లు మరింత పెరిగాయి. 57,442 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 776 పాయింట్ల లాభంతో 57,356 వద్ద ముగిసింది.


NSE Nifty


సోమవారం 16,953 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,121 వద్ద ఓపెనైంది. కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఉదయం నుంచి సూచీ పై స్థాయిల్లో కదలాడింది. 17,063 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. ఆఖర్లో 17,223 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మొత్తంగా 246 పాయింట్ల లాభంతో 17,200 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ట్రేడ్‌ అయింది. ఉదయం 36,515 వద్ద మొదలైంది. 36,265 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,604 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 332 పాయింట్ల లాభంతో  36,404 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభపడగా 8 నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌, పవర్‌గ్రిడ్‌, టైటాన్‌ లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, అపోలో హస్పిటల్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందాల్కో, మారుతీ నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. ఆటో, రియాల్టీ, పవర్‌ సూచీలు 2-3 శాతం ఎగిశాయి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌ 0.7 నుంచి 1.5 శాతం వరకు లాభపడ్డాయి.