Stock Market @ 12PM:  భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవ్వడం మదుపర్లలో సానుకూల సెంటిమెంట్‌ నింపింది. ఎఫ్‌ఎంసీజీ షేర్లకు గిరాకీ ఉంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,348 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 350 పాయింట్లు లాభపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 57,521 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,817 వద్ద లాభాల్లో మొదలైంది. ఉదయం నుంచే దూకుడుగా ట్రేడ్‌ అవుతోంది. 57,544 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. 57,544 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 350 పాయింట్ల లాభంతో 57,871 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


గురువారం 17,245 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,329 వద్ద ఓపెనైంది. కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఉదయం నుంచి సూచీ పై స్థాయిలో కదలాడుతోంది. 17,357 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. 17,240 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 103 పాయింట్ల లాభంతో 17,348 వద్ద కొనసాగుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 36,474 వద్ద మొదలైంది. 36,342 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,718 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 207 పాయింట్ల లాభంతో 36,629 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభపడగా 18 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్‌, పవర్‌గ్రిడ్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. రియాల్టీ సూచీ ఒక శాతం పెరిగింది. ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ షేర్లకు గిరాకీ ఉంది.