Stock Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం నుంచి జోరుగా ఎగిసిన బెంచ్‌మార్క్ సూచీలు సాయంత్రానికి పతనం అయ్యాయి. ధరల పెరుగుదల, కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం మదుపర్ల సెంటిమెంటు దెబ్బతీశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,682 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 660 పాయింట్ల లాభం నుంచి 33కు పడిపోయింది. షార్ట్‌టర్మ్ సెంటిమెంటు బలహీనంగా ఉంది.
BSE Sensex
క్రితం సెషన్లో 55,669 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 56,255 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. ఉదయం నుంచే కొనుగోళ్ల సందడి కొనసాగింది. 56,566 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆఖర్లో సెల్లింగ్ ప్రెజర్ వల్ల 55,613 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 600+ పాయింట్ల లాభం నుంచి 33 పాయింట్లకు పడిపోయి 55,702 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 16,677 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,854 వద్ద ఓపెనైంది. ఉదయం నుంచి దూకుడుగా కదలాడింది. 16,945 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. ఆఖర్లో పడిపోవడంతో 16,651 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మొత్తంగా 5 పాయింట్ల లాభంతో 16,682 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో నుంచి నష్టాల్లో ముగిసింది. ఉదయం 35,705 వద్ద మొదలైంది. 35,133 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,934 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖర్లో విక్రయాలు జరగడంతో 31 పాయింట్ల నష్టంతో 35,232 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభపడగా 31 నష్టాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, సన్‌ఫార్మా, టాటా కన్జూమర్స్, నెస్లే ఇండియా నష్టపోయాయి. పవర్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ సూచీలు 1-2 శాతం వరకు లాభపడ్డాయి. రియాల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, బ్యాంకింగ్ సూచీలు పతనం అయ్యాయి.