Stock Market Opening Bell on 9 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ విధానం ప్రభావం ఎక్కువేమీ లేదు. అయితే డోజోన్స్‌, నాస్‌డాక్‌ సూచీలు భారీగా పతనమవ్వడం, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడం బెంచ్‌మార్క్‌ సూచీలు నష్టాల్లో మొదలయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 45 పాయింట్ల నష్టంతో 16,313, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 171 పాయింట్ల నష్టంతో 54,716 వద్ద కొనసాగుతున్నాయి. 


BSE Sensex


క్రితం సెషన్లో 54,892 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,514 వద్ద నష్టాల్లో మొదలైంది. 54,507 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,798 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. పది గంటల ప్రాంతంలో 171 పాయింట్ల నష్టంతో 54,716 వద్ద కొనసాగుతోంది. ఆరంభం నుంచే సూచీపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది.


NSE Nifty


బుధవారం 16,356 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,263 వద్ద ఓపెనైంది. 16,243 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,335 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 45 పాయింట్ల నష్టంతో 16,313 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ నష్టాల్లో ఉంది. ఉదయం 34,802 వద్ద మొదలైంది. 34,685 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,830 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 206 పాయింట్ల నష్టంతో 34,739 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 15 కంపెనీలు లాభాల్లో 34 నష్టాల్లో ముగిశాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో, కోల్‌ ఇండియా, సిప్లా షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. టాటాస్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, గ్రాసిమ్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నష్టాల్లో కొనసాగుతాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, హెల్త్‌కేర్‌, ఫార్మా షేర్లకు గిరాకీ ఉంది.