Stock Market @ 12 PM:  భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,483 వద్ద ట్రేడ్‌అవుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 134 పాయింట్ల మేర నష్టాల్లో ఉంది.


BSE Sensex


క్రితం సెషన్లో 58,576 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,910 వద్ద లాభాల్లో మొదలైంది. కాసేపటికే సూచీ ఒడుదొడుకులకు లోనైంది. 58,425 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 59,003 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 134 పాయింట్ల నష్టంతో 58,438 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


మంగళవారం 17,530 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,599 వద్ద ఓపెనైంది. ఉదయం 17,663 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత 17,493 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని  చేరుకుంది. ప్రస్తుతం 42 పాయింట్ల నష్టంతో 17,487 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ 37,887 వద్ద మొదలైంది. 37,541 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,988 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 182 పాయింట్ల లాభంతో 37,564 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభపడగా 26 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్స్‌, యూపీఎల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, సన్‌ ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌ మాత్రం ఒక శాతం లాభపడ్డాయి.