Stock Market News Updates Today in Telugu: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఏరోజుకారోజు కొత్త రికార్డ్‌లు క్రియేట్‌ అవుతూనే ఉన్నాయి. ఈ రోజు (గురువారం, 26 సెప్టెంబర్‌ 2024) స్టాక్‌ మార్కెట్‌ బేర్‌ గ్రిప్‌ను తప్పించుకునేందుకు చాలా స్మార్ట్‌గా మూవ్‌ అవుతోంది. వాస్తవానికి, షేర్‌ మార్కెట్లు ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ వెంటనే కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈరోజు ఐటీ షేర్లలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.


మార్కెట్‌ ప్రారంభమైన దాదాపు గంట సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 85400 స్థాయిని దాటింది, 85,433.31 వద్ద చారిత్రక గరిష్ట స్థాయికి ‍(Sensex at fresh all-time high) చేరుకుంది. NSE నిఫ్టీ 26,075.20కి (Nifty at fresh all-time high) చేరింది, దాని జీవితకాల గరిష్ఠ స్థాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..


గత సెషన్‌లో (బుధవారం) 85,169 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు ఫ్లాట్‌గా 85,167.56 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. బుధవారం 26,004 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 26,005.40 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ భిన్నంగా కనిపిస్తుంది. ప్రి-ఓపెనింగ్‌ సెషన్‌లో బీఎస్‌ఇ సెన్సెక్స్ సుమారు 160 పాయింట్ల వరకు పెరిగింది, కానీ మార్కెట్‌ ప్రారంభ సమయానికి అది డౌన్‌ జోన్‌లోకి పడిపోయింది. అదే సమయంలో, నిఫ్టీ ప్రి-ఓపెనింగ్‌లో పెరుగుతూ కనిపించింది, ట్రేడ్‌ ప్రారంభమైన తర్వాత అది రికార్డు గరిష్ట స్థాయికి 26,051.30 వద్దకు చేరుకుంది.


సెన్సెక్స్ & నిఫ్టీ షేర్ల పరిస్థితి
ఓపెనింగ్‌ ట్రేడ్‌లో.. సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 16 స్టాక్స్‌ పెరిగే ధోరణిలో, 14 స్టాక్స్‌ పడిపోయే మూడ్‌లో ఉన్నాయి. పెరుగుతున్న స్టాక్స్‌లో... మారుతి సుజుకీ 2.14 శాతం, టాటా మోటార్స్ 1.09 శాతం, నెస్లే ఇండియా 1.06 శాతం, ఐటీసీ 0.78 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.72 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.65 శాతం లాభపడ్డాయి. పడిపోతున్న స్టాక్స్‌లో... పవర్‌గ్రిడ్‌ 1.18 శాతం, ఎన్‌టీపీసీ 0.76 శాతం, టాటా స్టీల్‌ 0.46 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 0.45 శాతం, టైటన్‌ స్టీల్‌ 0.41 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్టీల్‌ 0.37 శాతం నష్టపోయాయి.  


ఓపెనింగ్‌ టైమ్‌లో, నిఫ్టీ 50 ప్యాక్‌లో.. 28 షేర్లు లాభపడగా, 22 షేర్లు క్షీణించించాయి. 


నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 కూడా ఓపెన్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


సెక్టార్లవారీగా చూస్తే... IT ఇండెక్స్ అత్యధికంగా లాభపడింది. FMCG, రియాల్టీ సూచీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫైనాన్షియల్స్, మెటల్ స్టాక్స్‌ పడిపోతున్నాయి.


ప్రి మార్కెట్‌
ప్రి-మార్కెట్‌ ట్రేడ్‌లో, సెన్సెక్స్ 159.97 పాయింట్లు లేదా 0.19 శాతం లాభంతో 85329 స్థాయి వద్ద ఉండగా, నిఫ్టీ కేవలం 8.90 శాతం పతనంతో 25995 స్థాయి వద్ద ట్రేడయింది. 


ఉదయం 10.15 గంటలకు, BSE సెన్సెక్స్ 164.00 పాయింట్లు లేదా 0.19% పెరిగి 85,333.87 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ 58.10 పాయింట్లు లేదా 0.22% పెరిగి 26,062.25 దగ్గర ట్రేడవుతోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ రోజు, ఆసియా మార్కెట్లలో హాంగ్ కాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ లాభాల్లోకి మారింది. జపాన్‌లో నికాయ్‌ 1.7 శాతం, టోపిక్స్ 1.2 శాతం పెరిగాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 1.77 శాతం గెయిన్ అయింది. ఆస్ట్రేలియాకు చెందిన S&P/ASX 200 0.68 శాతం లాభపడింది. బుధవారం, అమెరికన్‌ మార్కెట్లలో డౌ జోన్స్‌, S&P 500 ప్రారంభ ట్రేడ్‌లలో రికార్డు స్థాయిలను తాకి, ఆ తర్వాత లోయర్‌ సైడ్‌లో ముగిశాయి. నాస్‌డాక్ ఫ్లాట్‌గా క్లోజ్‌ అయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: భారీగా పడిపోయిన ఇంధనం రేట్లు - మీ ప్రాంతంలో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి