Stock Market Opening 04 May 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం మోస్తరు లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. యూఎస్ ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు వడ్డీరేటు పెంచినా మన మార్కెట్లపై ఎఫెక్ట్ తక్కువగానే ఉంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 46 పాయింట్లు పెరిగి 18,136 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 141 పాయింట్లు పెరిగి 61,334 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,193 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,258 వద్ద మొదలైంది. 61,119 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,338 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 141 పాయింట్ల లాభంతో 61,334 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 18,098 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,081 వద్ద ఓపెనైంది. 18,066 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,137 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 46 పాయింట్లు పెరిగి 18,136 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ పెరిగింది. ఉదయం 43,236 వద్ద మొదలైంది. 43,213 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,374 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 23 పాయింట్లు పెరిగి 43,336 వద్ద కదలాడుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా స్టీల్, ఎస్‌బీఐ లైఫ్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్జూమర్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి. ఫైనాన్స్, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.62,180గా ఉంది. కిలో వెండి రూ.300 పెరిగి రూ.77,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.70 పెరిగి రూ.27,580 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.