Smallcap stocks: ఈ వారంలో, ఇండియన్ స్టాక్ మార్కెట్లు అప్&డౌన్ జర్నీలతో అస్థిరంగా ఉన్నా, 23 స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం మార్కెట్ మూడ్‌తో సంబంధం లేకుండా పెరుగుతూనే వెళ్లాయి, వీక్లీ గెయిన్స్ కళ్లజూశాయి. వీటిలో 4 స్క్రిప్స్ 52 వారాల గరిష్టాలను మళ్లీ పరీక్షించాయి.
ఈ వారంలో ఈక్విటీ మార్కెట్లు చాలా వరకు ఎరుపు రంగులో ట్రేడ్ అయ్యాయి, వారాంతంలో లాభపడ్డాయి. ఊహించిన కంటే తక్కువ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందన్న ఫెడ్ అధికారుల వ్యాఖ్యలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ఉత్సాహపరిచాయి, ఇండియన్ మార్కెట్లు కూడా లాభపడ్డాయి.
USకు చెందిన GQG Partners తో రూ. 15,000 కోట్ల డీల్ తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ కూడా గరిష్టంగా ర్యాలీ చేశాయి, శుక్రవారం మొత్తం సెంటిమెంట్‌ను పాజిటివ్‌గా మార్చాయి. ఆటో, హెల్త్‌కేర్, Teck టెక్, IT మినహా అన్ని రంగాలు వారంలో గ్రీన్‌లో ముగిశాయి. BSE రియాల్టీ 8.19% వారపు లాభంతో టాప్ వీక్లీ గెయినర్‌గా నిలిచింది.
స్మాల్ క్యాప్ ప్యాక్‌లో... మోనార్క్ నెట్‌వర్త్ క్యాపిటల్, కిరి ఇండస్ట్రీస్ 25% పైగా లాభపడగా; DB రియాల్టీ, సస్తాసుందర్ వెంచర్స్, జీ మీడియా కార్పొరేషన్ 15% పైగా పెరిగాయి.
10% పైగా పెరిగిన ఇతర స్మాల్ క్యాప్ స్టాక్స్ - పటేల్ ఇంజినీరింగ్, సెరెబ్రా ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్, ఫోసెకో ఇండియా, అనుపమ్ రసాయన్ ఇండియా, టాటా టెలీసర్వీసెస్ (మహారాష్ట్ర), ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సొనాటా సాఫ్ట్‌వేర్, అలోక్ ఇండస్ట్రీస్, ఏసియన్ ఎనర్జీ సర్వీసెస్, యూకో బ్యాంక్, పంజాబ్ & సింద్ బ్యాంక్, త్రివేణి టర్బైన్, కెపాసైట్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, గాయత్రీ ప్రాజెక్ట్స్, నెల్కో, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.
ఈ వారంలో ఏ స్టాక్, ఎంత శాతం లాభపడింది?
మోనార్క్ నెట్‌వర్త్ క్యాపిటల్ (Monarch Networth Capital) 28%
కిరి ఇండస్ట్రీస్ (Kiri Industries) 24%
డీబీ రియాల్టీ (DB Realty) 19%
సస్తాసుందర్ వెంచర్స్ (Sastasundar Ventures) 17%
జీ మీడియా కార్పొరేషన్ (Zee Media Corporation) 15%
పటేల్ ఇంజనీరింగ్ (Patel Engineering) 15%
సెరెబ్రా ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్ (Cerebra Integrated Technologies) 14%
ఫోసెకో ఇండియా (Foseco India) 14%
అనుపమ్ రసాయన్ ఇండియా (Anupam Rasayan India) 14%
టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) (Tata Teleservices (Maharashtra)) 13%
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Equitas Small Finance Bank) 13%
రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Reliance Infrastructure) 13%
సొనాటా సాఫ్ట్‌వేర్ (Sonata Software) 13%
అలోక్ ఇండస్ట్రీస్ (Alok Industries) 13%
ఏసియన్ ఎనర్జీ సర్వీసెస్ (Asian Energy Services) 12%
యూకో బ్యాంక్ (UCO Bank) 12%
పంజాబ్ & సింద్ బ్యాంక్ (Punjab & Sind Bank) 11%
హరి ఓం పైప్ ఇండస్ట్రీస్ (Hariom Pipe Industries) 11%
త్రివేణి టర్బైన్ (Triveni Turbine) 10%
కెపాసైట్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ (Capacit'e Infraprojects) 10%