TCS Shares: భారతదేశంలోని IT మేజర్‌ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), 2023 మార్చి త్రైమాసికం ఫలితాలను బుధవారం నాడు (12 ఏప్రిల్‌ 2023) ప్రకటించింది. మార్కెట్‌ అంచనాల కంటే తక్కువ లాభాన్ని, ఆదాయాన్ని ఈ కంపెనీ నివేదించింది. ఈ ఫలితాల తర్వాత, టాప్‌ బ్రోకరేజీలు ఈ స్టాక్‌పై తమ పాత వైఖరినే కొనసాగించాయి. అయితే.. టార్గెట్‌ ధరల్లో కనిపించిన మార్పులను బట్టి, టీసీఎస్‌ షేర్లు 17% వరకు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.


TCS, మార్చి త్రైమాసిక ఆదాయంలో 16.9% జంప్ చేసి రూ. 59,162 కోట్లకు చేరుకుంది. లాభం 14.76% పెరిగి రూ. 11,392 కోట్లకు చేరుకుంది. టాల్‌ లైన్‌, బాటమ్‌ లైన్‌ గణాంకాలు రెండూ దలాల్‌ స్ట్రీట్‌ అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. నిన్న మార్కెట్ గంటలు ముగిసిన తర్వాత ఈ కంపెనీ Q4 ఫలితాలను ప్రకటించింది.


మార్కెట్‌ అంచనాలు మిస్‌ కావడంతో, టీసీఎస్ షేర్లు ఇవాళ (గురువారం, 13 ఏప్రిల్‌ 2023) నష్టంతో ప్రారంభం అయ్యాయి, అక్కడి నుంచి కూడా పడుతూనే ఉన్నాయి. ఉదయం 10.15 గంటలకు BSEలో ఈ షేరు 1.73 శాతం లేదా రూ. 57.10 క్షీణించి రూ. 3,184 వద్ద ట్రేడవుతోంది. 


ఫలితాల ప్రకటన తర్వాత బ్రోకరేజ్‌లు ఇచ్చిన రేటింగ్స్, టార్గెట్‌ ధరలు:


బ్రోకరేజ్‌ పేరు: జేపీ మోర్గాన్‌ ‍(JP Morgan)
టీసీఎస్‌కు బ్రోకరేజ్‌ ఇచ్చిన రేటింగ్‌: అండర్‌ వెయిట్‌
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 2,700
అమెరికా వ్యాపారంలో బలహీనత కారణంగా, అన్ని విభాగాల్లో ఆధిక్యాన్ని టీసీఎస్‌ కోల్పోయింది. డిమాండ్ బలహీనంగా ఉండడం వల్ల భవిష్యత్‌ వృద్ధిపై స్పష్టత లేదు అని బ్రోకరేజ్‌ చెప్పింది.


బ్రోకరేజ్‌ పేరు: మోర్గాన్‌ స్టాన్లీ (Morgan Stanley)
టీసీఎస్‌కు బ్రోకరేజ్‌ ఇచ్చిన రేటింగ్‌: ఈక్వల్‌ వెయిట్‌
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 3,350
10 బిలియన్‌ డాలర్ల వద్ద ఉన్న ఆర్డర్‌ బుక్‌ను ఈ బ్రోకరేజ్‌ పాజిటివ్‌గా చూస్తోంది. ఆర్డర్‌ బుక్‌ YoYలో 11.5% తగ్గినా, QoQలో 28.2% పెరిగింది. అట్రిషన్‌ రేట్‌ QoQలో 120 తగ్గడం, నికర లాభంలో OCF (Operating cash flow) 104.1%గా ఉండడం ప్లస్‌ పాయింట్స్‌గా చెబుతోంది.


బ్రోకరేజ్‌ పేరు: నోమురా (Nomura)
టీసీఎస్‌కు బ్రోకరేజ్‌ ఇచ్చిన రేటింగ్‌: రెడ్యూస్‌
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 2,830
కంపెనీకి సమీప కాలంలో ఆదాయ వృద్ధి అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల ఈ స్టాక్‌పై 'రెడ్యూస్‌' రేటింగ్‌ను కొనసాగించినట్లు బ్రోకరేజ్ తెలిపింది. 4QFY23 ఆదాయం, మార్జిన్ అంచనాలను కోల్పోవడంతో ప్రైస్‌ టార్గెట్‌ను రూ. 2,830కి తగ్గించింది. అధికంగా ఉన్న ఆర్థిక అస్థిరత కారణంగా USలో రికవరీని ఆలస్యం కావచ్చని బ్రోకరేజ్‌ వెల్లడించింది. యూరప్‌లో ఔట్‌లుక్ మెరుగుపడుతోందని తెలిపింది.


బ్రోకరేజ్‌ పేరు: ఎంకే గ్లోబల్‌ (Emkay Global Financial Services)
టీసీఎస్‌కు బ్రోకరేజ్‌ ఇచ్చిన రేటింగ్‌: హోల్డ్‌
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 3,300 
TCS FY23 పనితీరును చూసిన తర్వాత, FY24-25 ఆదాయ అంచనాలను 0-1.5% మేర బ్రోకరేజ్‌ తగ్గించింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.