Sensex Today: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్... 162.78 పాయింట్లు దిగిన సెన్సెక్స్.. 45.75 పాయింట్లు పతనం

స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ తొలిసారిగా 56,000 మార్కు చేరుకుంది. ఇది నిఫ్టీ జీవితకాల గరిష్ట విలువ అని నిపుణులు చెబుతున్నారు.

ABP Desam Last Updated: 18 Aug 2021 04:04 PM
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. నేటి ఉదయం 305.47 పాయింట్లు  లాభపడి 56,097.74 పాయింట్లకు చేరిన సెన్సెక్స్.. బుధవారం సాయంత్రానికి 55,629.49 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఉదయం ప్రారంభమైన 55,792.27 పాయింట్లతో పోల్చితే 162.78 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 45.75 పాయింట్లు నష్టపోయి 16,568.85 పాయింట్లకు దిగొచ్చింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ మరియు ఫార్మాలు స్వల్ప లాభాలు నమోదుచేశాయి.

Sensex Todya: నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్‌ ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. బీఎస్‌ఈ యాభై పాయింట్లకుపైగా నష్టాల్లో కొనసాగుతుంటే... నిఫ్టీ కూడా ‌అదే బాటలో ఉంది. ముఫ్పై పాయింట్లకుపైగా  దిగువన ట్రేడ్ అవుతోంది.  

ఆసియా స్టాక్స్, అమెరికా ఈక్విటీ ఫ్యూచర్స్‌లో మార్పులు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నాడు 0.50 శాతం పెరిగాయి. ఆసియా స్టాక్స్, అమెరికా ఈక్విటీ ఫ్యూచర్స్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో స్టాక్ మార్కెట్‌లో పలు షేర్ల విలువ క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే కెనరా బ్యాంకు స్టాక్ విలువ 0.36 శాతం తగ్గింది. ప్రస్తుతం ఆ స్టాక్ విలువ రూ.152.10కు దిగొచ్చింది.

Background

స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. నేటి ఉదయం ఏకంగా 305.47 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ తొలిసారిగా 56,000 మార్కు చేరుకుంది. ఇది నిఫ్టీ జీవితకాల గరిష్ట విలువ. ప్రస్తుతం సెన్సెక్స్ విలువ 56,097.74గా ఉంది. అదే సమయంలో నిఫ్టీ కూడా 79.95 పాయింట్ల మేర పుంజుకుంది. దాంతో నిఫ్టీ ప్రస్తుత విలువ 16,694.55 అయింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.