Samvardhana Motherson Shares: ఇవాళ్టి (మంగళవారం) ట్రేడ్‌లో, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ (SAMIL) షేర్లు 7 శాతం పైగా పతనంతో రూ. 63.30 వద్ద 52 వారాల కనిష్టానికి చేరాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 29న తాకిన మునుపటి కనిష్ట స్థాయి రూ.68.53 కంటే ఇవాళ దిగువకు పడిపోయింది.
ఈ ఆటో అనుబంధ కంపెనీకి చెందిన 100 మిలియన్లకు పైగా షేర్లు బ్లాక్ డీల్స్ ద్వారా చేతులు మారడంతో ఇంత భారీగా పడిపోయింది.
ఉదయం 09:15 గంటల సమయంలో, SAMIL మొత్తం ఈక్విటీలో 2.95 శాతానికి సమానమైన 133.35 మిలియన్ షేర్లు (13.33 కోట్ల షేర్లు) BSEలో చేతులు మారాయని ఎక్స్ఛేంజ్ డేటా చూపిస్తోంది. అమ్మింది ఎవరో, కొన్నది ఎవరో ఇవాళ సాయంత్రానికి తెలుస్తుంది.
నమ్మకమైన సమాచారం ప్రకారం... జపాన్‌కు చెందిన సోజిట్జ్ కార్ప్ (Sojitz Corp), బ్లాక్ డీల్ ద్వారా ఈ ఆటో కాంపోనెంట్ మేజర్‌లో 1.9 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. బ్లాక్ డీల్ ఫ్లోర్ ప్రైస్ ఒక్కో షేరుకు రూ. 64.36. అంటే, ఈ ధర లేదా ఇంతకంటే ఎక్కువ ధరకు షేర్లు చేతులు మారాయి.
ఫ్లోర్ ప్రైస్ రూ.64.36
ఉదయం 10:19 గంటల సమయానికి S&P BSE సెన్సెక్స్‌లోని 1.2 శాతం పెరుగుదలతో పోలిస్తే, ఈ షేరు 6 శాతం తగ్గి రూ. 65.20 వద్ద ట్రేడయింది. ఆ సమయానికి NSE, BSEలో కలిపి 202 మిలియన్ షేర్ల (20.20 కోట్ల షేర్లు) ట్రేడింగ్ జరిగింది.
మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి ఈ షేరు 7.15 శాతం క్షీణించి, రూ. 64.25 వద్ద కదులుతోంది.
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా వైపు పరిమితుల కారణంగా గత కొన్ని త్రైమాసికాలుగా ఈ కంపెనీ లాభదాయకత, పనితీరు క్షీణిస్తోంది. ఎబిటా (EBITDA) మార్జిన్ Q1FY23లో 6.5 శాతంగా ఉంది, ఇది Q4FY22లోని 7.1 శాతం నుంచి తగ్గింది. లాభదాయకత పెంచుకునేందుకు.. ఖర్చులు తగ్గించేలా కంపెనీ కొన్ని చర్యలు చేపట్టిందని, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు/లోయర్ ఆఫ్‌టేక్‌లను భర్తీ చేసుకునేందుకు తన కస్టమర్లతో చర్చలు జరుపుతోందని రేటింగ్ ఏజెన్సీ ICRA పేర్కొంది.
సైక్లికాలిటీ, పెరుగుతున్న రెగ్యులేటరీ జోక్యాలు, కీలకమైన అభివృద్ధి చెందిన మార్కెట్లలో, ముఖ్యంగా యూరప్‌లోని (కంపెనీ ఆదాయంలో దాదాపు 40 శాతం) ఆటోమోటివ్ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ వంటి సవాళ్లను ఈ కంపెనీ ఎదుర్కొంటోంది. వీటి వల్ల SAMIL ఫైనాన్షియల్ పెర్పార్మెన్స్ ప్రభావితమవుతోంది. దీనికితోడు, ఆదాయం కోసం యూరోపియన్ OEMల మీద ఎక్కువగా ఆధారపడటం, ఆ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ గొడవలు, వాణిజ్య సుంకాలతో డిమాండ్ తగ్గడం వంటివి కంపెనీ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
అయితే, SAMIL పాదముద్ర ప్రపంచవ్యాప్తంగా 269 ప్రాంతాల్లో విస్తరించి ఉంది. దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఈ కంపెనీ మీద "స్టేబుల్" రేటింగ్‌ను ICRA జారీ చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.