Rules For Luggage Carrier On Private Cars In India : భారతదేశంలో కొన్ని కోట్ల మందికి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ (Light Motor Vehicle (LMV) Driving License) ఉంది. ఈ లైసెన్స్ ఉన్నవాళ్లంతా కార్ నడపవచ్చు. కారును రోడ్డుపైకి తీసుకువచ్చినప్పుడు, మోటారు వాహనాల చట్టం నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఎవరైనా రూల్స్‌కు విరుద్ధంగా బండి తోలితే జరిమానా కట్టాల్సి వస్తుంది. మన రోడ్లపై చాలా టూరిస్ట్ వాహనాలు తిరగడాన్ని మనం చూస్తుంటాం. ఆ టూరిస్ట్ వాహనాలపైన అమర్చిన లగేజీ రాక్‌లను (Car luggage rack) కూడా మనం చూస్తుంటాం. సాధారణంగా, టూరిస్టులు ఎక్కువ రోజులు ప్రయాణిస్తుంటారు కాబట్టి, ఎక్కువ లగేజీని తమ వెంట తీసుకువెళతారు. అందుకే టూరిస్ట్ వెహికల్స్ పైకప్పు మీద లగేజీ ర్యాక్‌లు ఉంటాయి.
ప్రైవేట్ కారులో కూడా లగేజీ రేక్‌ని అమర్చవచ్చా?
సొంత కారు/ ప్రైవేట్ కారు పైకప్పుపై కూడా లగేజీ ర్యాక్‌ను అమర్చవచ్చా (Luggage Rack On Top Of A Private Car) అనే ప్రశ్న చాలామందికి వచ్చి ఉంటుంది. టూరిస్ట్ వాహనాల్లో లగేజీ ర్యాక్‌ను ఏర్పాటును చూస్తుంటాం కాబట్టి, సొంత కారుకు కూడా అలాంటి ఏర్పాటు ఉంటే బాగుంటుందని అనుకుంటారు. దీనివల్ల, ఎక్కువ సామాను ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే, సొంత కారుకు లగేజీ ర్యాక్ ఏర్పాటు చేయడం సబబేనా? మోటారు వాహనాల చట్టం నిబంధనలు దీనిని అనుమతిస్తాయా?. ఇప్పటికే కారు ఉన్న లేదా కారు కొనబోయేవాళ్లు కచ్చితంగా తెలుసుకోవలసిన విషయం ఇది.
మరో ఆసక్తికర కథనం: కస్టమర్లకు అలెర్ట్ - డిసెంబర్‌లో బ్యాంక్‌లు 17 రోజులు పని చేయవు
మోటారు వాహనాల చట్టం ప్రకారం, ప్రైవేట్ కారులో లగేజీ ర్యాక్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ప్రత్యేకమైన షరతు ఏమీ లేదు. ఎవరైనా ప్రైవేట్ కారులో లగేజీ ర్యాక్‌ని ఏర్పాటు చేయాలనుకుంటే హ్యాపీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇలా చేసినందుకు ట్రాఫిక్ పోలీసులెవరూ చలాన్ చేయలేరు.
RTO నుంచి అనుమతి అవసరం
అయితే, కొన్ని రాష్ట్రాల్లో భిన్నమైన నియమాలను ఉండొచ్చు. మీ కారు పైభాగాన లగేజీ ర్యాక్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ముందుగాస ఆర్‌టీవో (Regional Transport Office - RTO) నుంచి అనుమతి తీసుకోవలసి రావచ్చు. ముఖ్యంగా, మీ కారు 10 సంవత్సరాలకు పైబడి పాతది అయితే ఆర్‌టీవో నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎక్కువ సందర్భాల్లో, మీ కారు వయస్సు పదేళ్లు దాటితే, లగేజీ ర్యాక్ ఇన్‌స్టాలేషన్ కోసం RTO అనుమతించకపోవచ్చు.
మోటారు వాహనాల చట్టం 1988 (Motor Vehicles Act 1988) ప్రకారం, ప్రైవేట్/ సొంత కార్ పైకప్పుపై సామాన్ల ర్యాక్‌ను ఏర్పాటు చేసుకోవడంపై ఎలాంటి నిషేధం లేదు. కారు యజమాని తన కోరిక లేదా అవసరానికి అనుగుణంగా లగేజ్ రాక్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: భారీగా తగ్గిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ