Reliance Jio Rs 189 Prepaid Plan Details In Telugu: భారతదేశంలోని అతి పెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియోకు కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. వాళ్లలో చాలామంది రెండో సిమ్ కూడా (జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ ఏదైనా కావచ్చు) వాడుతున్నారు. ఇలా రెండు నెట్‌వర్క్‌లను ఉపయోగించుకున్న యూజర్లలో కొందరు జియో సిమ్‌ను ఎక్కువగా వాడనప్పటికీ, ఆ నంబర్‌ను మాత్రం పోగొట్టుకోకూడదని భావిస్తుంటారు. ఫ్యాన్సీ నంబర్, పర్సనల్ నంబర్ లేదా ఇతర కారణాల వల్ల ఆ నంబర్‌ను వదులుకోవడానికి మాత్రం ఇష్టపడరు. అలాంటి వ్యక్తులు, నంబర్ పోకుండా ఉండేందుకు తమకు అవసరం లేకున్నా ఖరీదైన ప్రీ పెయిడ్ ప్లాన్స్‌తో రీఛార్జ్ చేయాల్సి వస్తోంది.
అయితే, మీ జియో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచేందుకు ఖరీదైన ప్లాన్స్‌తో రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ధరకే సూపర్ స్పీడ్‌తో డేటాను అందించే ప్లాన్ ఒకటి ఉంది. ఈ ప్లాన్‌లో ఇన్‌కమింగ్ & ఔట్‌గోయింగ్ కాల్స్, SMSలతో పాటు డేటా కూడా వస్తుంది, ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంతకాలం మీ సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది.
మీ జియో జియో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచేందుకు రూ.189 తో రీఛార్జ్ చేస్తే చాలు. కొన్ని సంవత్సరాల క్రితం ప్లాన్స్ కంటే కొంచం రేటెక్కువ అయినప్పటికీ, ప్రస్తుతం ప్రైవేట్ టెల్కోలు ఇస్తున్న ఆఫర్లలో ఇది బెటర్ వన్.
రిలయన్స్ జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు (Reliance Jio Rs 189 Prepaid Plan Benefits):
రిలయన్స్ జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌పై అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు, 2 GB డేటా వస్తుంది. ఈ 28 రోజుల్లో 300 SMSలను ఉచితంగా పంపుకోవచ్చు. అంటే, రోజుకు సగటున 10 SMSలపైనే వాడుకోవచ్చు. అంతేకాదు, జియో వినియోగదార్ల కోసం ఈ ప్లాన్‌తో జియో సినిమా (Jio Cinema), జియో క్లౌడ్ (Jio Cloud), జియో టీవీ (Jio TV) ప్రైమరీ మెంబర్‌షిప్ కూడా యాడ్ అవుతుంది. 2 GB డేటాను పూర్తిగా వాడుకున్న తర్వాత FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి పడిపోతుంది.
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్‌ను ఇప్పటికే చాలామంది యూజర్లు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఔట్ గోయింగ్ & ఇన్‌కమింగ్ కాల్స్ ఉపయోగించుకుంటూ రోజుకు కొన్ని SMSలు పంపగలిగితే చాలు, పెద్ద మొత్తంలో డేటా అవసరం లేదు అనుకునే వ్యక్తులకు కూడా ఇది చాలా అనువైన ప్లాన్. అంటే, బేసిక్ నీడ్స్ చాలు అనుకునే యూజర్ల కోసం ఇది ఉత్తమ బడ్జెట్ ప్లాన్స్‌లో ఒకటి. అయితే, ఈ ప్లాన్‌లో అపరిమిత 5G ఉండదు.
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్ దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు అందుబాటులో ఉంది. మైజియో (MyJio) యాప్, జియో.కామ్, ఇతర థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ ప్రి-పెయిడ్ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్ల సవరణ - పీపీఎఫ్, సుకన్య సమృద్ధి రేట్లు ఎంత మారొచ్చు?