RIL Q4 Results Today: బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్‌ ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసిక (Q4 FY24) ఫలితాలను ఈ రోజు ప్రకటించనుంది. FY24 డివిడెండ్‌ను కూడా ఈ రోజు ఆమోదిస్తుంది. 


మెజారిటీ బ్రోకరేజ్ కంపెనీ, దలాల్‌ స్ట్రీట్‌ ఎనలిస్ట్‌ల అభిప్రాయం ప్రకారం... టెలికాం, రిటైల్ వ్యాపారాల్లో ఆకర్షణీయమైన ఆదాయాలు, పనితీరును రిలయన్స్‌ రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. గ్రాస్‌ రిఫైనరీ మార్జిన్‌ల (GRMలు) వల్ల O2C (Oil to Chemicals) విభాగం మరింత బలంగా మారుతుందని భావిస్తున్నారు. నికర అప్పులు గరిష్ట స్థాయికి చేరాయని, వచ్చే 3-5 ఏళ్లలో EPS 14-15 శాతం CAGRతో పెరగొచ్చని లెక్కగట్టారు.


రిలయన్స్ Q4 ఫలితాల అంచనాలు: 


ఎలారా క్యాపిటల్: రిలయన్స్ ఏకీకృత ఎబిటా 11 శాతం YoY జంప్‌ చేయవచ్చు. రిఫైనింగ్‌/పెట్రోకెమ్‌/E&P ఎబిటా ‍‌(EBITDA) 4 శాతం, రిటైల్‌ ఎబిటా 42 శాతం, డిజిటల్ సేవల (టెలికాం) ఎబిటా 11 శాతం జంప్‌ చేయవచ్చు. Q4లో ఆదాయం ₹2,32,627.3 కోట్లు, ఎబిటా ₹42,523.4 కోట్లు, నికర లాభం ₹20,780 కోట్లుగా ఉంటుందన్నది ఈ బ్రోకరేజ్ అంచనా.


ఈక్విరస్ క్యాపిటల్: మెరుగైన O2C ఆదాయాల వల్ల లాభం QoQలో పెరుగుతుంది. జియో, రిటైల్ పటిష్టమైన పనితీరును కొనసాగుతుంది. అయితే E&P స్థిరంగా మారాలి. కంపెనీ ఏకీకృత నికర లాభం 14 శాతం, ఎబిటా 9.9 శాతం పెరుగుతుంది.


ICICI సెక్యూరిటీస్: O2C సెగ్మెంట్ ఆదాయం QoQలో భారీగా పెరిగే అవకాశం ఉంది. రిటైల్ ఎబిటా 1.4 శాతం వృద్ధి, జియో ఎబిటా దాదాపు రెండు శాతం పెరగొచ్చు. మొత్తమ్మీద, ఏకీకృత ఎబిటా 5 శాతం QoQ వృద్ధి సాధించొచ్చు. Q4లో కంపెనీ నికర లాభం దాదాపు 6 శాతం QoQ పెరుగుతుంది.


JM ఫైనాన్షియల్స్: రిలయన్స్ 4Q FY24 ఎబిటా 3.6 శాతం QoQ జంప్‌ చేసే ఛాన్స్‌ ఉంది. O2C ఎబిటా 11.8 శాతం QoQ వృద్ధితో ₹15,700 కోట్లకు పెరుగుతుందని; డిజిటల్ ఎబిటా 2.6 శాతం QoQ పెరిగి ₹14,600 కోట్లకు చేరుతుందని; రిటైల్ ఎబిటా ఫ్లాట్‌గా 0.4 శాతం వృద్ధితో ₹6,300 కోట్లకు చేరే అవకాశం ఉందని; E&P ఎబిటా 6.8 శాతం QoQ తగ్గి ₹5,400 కోట్లు చేరుతుందని అంచనా వేసింది.


నువామా ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: RIL ఏకీకృత ఎబిటా 8% పెరుగుతుంది; గ్యాస్ ఎబిటా 41%, రిటైల్ ఎబిటా 28% జంప్‌ చేస్తుంది. కానీ, O2C ఎబిటా 8% తగ్గుతుంది.


మోతీలాల్ ఓస్వాల్: రిలయన్స్‌ ఏకీకృత ఎబిటా ₹38,800 కోట్ల వద్ద YoYలో ఫ్లాట్‌గా ఉండవచ్చు. స్వతంత్ర ఎబిటా ₹18,260 కోట్లుగా (YoYలో 1 శాతం ఎక్కువ) లెక్క తేలవచ్చు. నూతన ఇంధన వ్యాపారంలో ₹75,000 కోట్ల ప్రకటనలపై మరింత స్పష్టత రావాలి. రిటైల్ స్టోర్ల ఏర్పాటులో వృద్ధి, టెలికాం టారిఫ్‌ల పెంపుపైనా మేనేజ్‌మెంట్‌ కామెంట్లను కీలకంగా చూడాలని ఈ బ్రోకరేజ్‌ సూచించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: జొమాటో ఫుడ్‌ మరింత కాస్ట్‌లీ గురూ - ఆర్డర్‌పై రూ.5 బాదుడు