RBI New Card Rules: మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. అయితే వాటి వ్యాలిడిటీ పూర్తవడమో, లేక పోయినప్పుడు కొత్త కార్డ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పాత కార్డుతో లింక్ అయి ఉన్న ఆటో పేమెంట్స్ నిలిచిపోతాయి. మళ్లీ కొత్త కార్డ్ అప్‌డేట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల అప్పటివరకూ మీ OTT సర్వీస్, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, SIP వంటి పేమెంట్స్ నిలిచిపోతాయి.

Continues below advertisement

ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి పాత కార్డ్స్ లింక్ అయి ఉన్న ప్రతిచోటా కొత్త కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది వినియోగదారులకు చాలా ఇబ్బందికరమైన పని. అసలే బిజీ షెడ్యూల్స్, రోజువారీ బిజినెస్ లేక ఆఫీసు పనులతో సతమతవుతుంటారు. ఈ సమస్య నుంచి కస్టమర్లను ఊరట కలిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటి గురించి ఇక్కడ తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది. 

కార్డు మారినా మీ పేమెంట్ ఆగదురిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం పాత కార్డ్ లింక్ పేమెంట్ ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఇప్పుడు బ్యాంకులు, కార్డు కంపెనీలు పాత కార్డుకు అనుసంధానమైన ఆటో పేమెంట్లను కొత్త కార్డుకు ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. అంటే మీరు కొత్త డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పటికీ సబ్‌స్క్రిప్షన్లు లేదా బిల్లులు, SIP వంటి ఈ-మ్యాండేట్ పేమెంట్లు వాటంతట అవే పేమెంట్ అవుతాయి. దాంతో మీరు పదేపదే పాత కార్డ్ లింక్ అయి ఉన్నచోట వివరాలను అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉండదు.

Continues below advertisement

కొత్త రూల్స్ ఏమిటి?ఇకపై మీ కార్డు మారినప్పుడు OTT, SIP, ఇన్సూరెన్స్ ప్రీమియం, EMI వంటి అన్ని ఆటో పేమెంట్లు ఆటోమేటిక్‌గా కొత్త కార్డుతో లింక్ అవుతాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, దీని కోసం వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు. ప్రతి ట్రాన్సాక్షన్ సమాచారంతో పాటు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కస్టమర్లకు కల్పిస్తారు. అలాగే కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారం కోసం బ్యాంకులు ఒక స్పెషల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఈ సౌకర్యం మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.. కస్టమర్లను ఆర్థిక నష్టాల నుండి కాపాడటం. కార్డు ఎక్స్‌పైరీ అయినా లేదా బ్లాక్ అయినా, దానికి సంబంధించి ఆటో పేమెంట్లు నిలిచిపోతాయి. SIP పెట్టుబడులు, లోన్ EMI పేమెంట్ మిస్ అవుతాయి. దాంతో మీకు ఫైన్ పడుతుంది. ఈ ఇబ్బందుల్ని తొలగించేందుకు కొత్త కార్డ్ తీసుకోగానే ఆటో పేమెంట్స్ యాక్టివేట్ అవుతాయి.

బ్యాంక్ అకౌంట్లో నగదు ఉన్నప్పటికీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల మీ పేమెంట్ పూర్తి కాకపోతే పెనాల్టీ రూపంలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ విధానంలో ఆర్బీఐ కొన్ని మార్పులు చేసి కార్డ్ వినియోగదారులకు ఊరట కలిగించింది.