Income Tax Bill: ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం ఎప్పటికీ బ్రహ్మ పదార్థంగా అనిపిస్తుంది. అయితే ఐటీఆర్ ఫైల్ చేసే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, పన్ను చెల్లింపుదారులలో కంగారు మొదలవుతుంది. ఒకవేళ టాక్స్ కట్టడానికి గడువు సమీపిస్తున్నా, మీ వద్ద డబ్బులు లేకపోయినా, మీరు క్రెడిట్ కార్డ్‌ను కూడా ఉపయోగించవచ్చు. నెట్ బ్యాంకింగ్, UPI లేదా డెబిట్ కార్డ్ వంటి ఆప్షన్ల ద్వారా కూడా ఇన్‌కమ్ టాక్స్ పేమెంట్ చేయవచ్చు అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

Continues below advertisement

BankBazaar.com CEO అధిల్ శెట్టి 'ది ఎకనామిక్ టైమ్స్'తో మాట్లాడుతూ పలు విషయాలు ప్రస్తావించారు. ‘ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ మీ టాక్స్ పేమెంట్ కోసం క్రెడిట్ కార్డ్ ఉపయోగించడంపై ఎలాంటి అభ్యంతరం తెలపదు. పేమెంట్ గేట్‌వే మీకు UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్,  క్రెడిట్ కార్డ్‌లతో సహా అన్ని డిజిటల్ పేమెంట్ ఆప్షన్లను అందిస్తుందని’ తెలిపారు.

దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి? టాక్స్ కట్టడానికి డెడ్‌లైన్ దగ్గరలో ఉండి, డబ్బు లేని సందర్భంలో ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

Continues below advertisement

క్రెడిట్ కార్డ్ మీకు 30-45 రోజుల వరకు వడ్డీ లేని కాలాన్ని (Interest-free period) అందిస్తుంది. తద్వారా మీరు పేమెంట్ తదుపరి బిల్లింగ్ సైకిల్ వరకు పూర్తి చేయవచ్చు. అయితే, మీరు డ్యూ డేట్ లోపు పూర్తి బిల్లు చెల్లించినప్పుడు మాత్రమే వడ్డీ లేని కాలం ప్రయోజనం లభిస్తుంది.

HDFC BizBlack వంటి కొన్ని ప్రీమియం లేదా బిజినెస్ కార్డ్‌లు టాక్స్ చెల్లింపుపై రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. 

పెద్ద మొత్తంలో టాక్స్ కట్టడం వల్ల మీ కార్డ్ వార్షిక ఖర్చు మైల్‌స్టోన్ స్పెండ్ (Milestone Spend) పూర్తి చేయడంలో సహాయపడుతుంది, తద్వారా వార్షిక రుసుము (Annual fee) మాఫీ అవుతుంది. 

దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి 

- క్రెడిట్ కార్డ్ ద్వారా ఇన్‌కమ్ టాక్స్ చెల్లిస్తే సాధారణంగా 0.72-1.25 శాతం వరకు ప్రాసెసింగ్ ఛార్జీ పడుతుంది. దీనిపై 18 శాతం GST కూడా వర్తిస్తుంది.

- సమయానికి క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే ఏడాదికి 36- 42 శాతం వరకు భారీ వడ్డీ చెల్లించాల్సి రావచ్చు.

- భారీ టాక్స్ పేమెంట్ వల్ల మీ క్రెడిట్ యుటిలైజేషన్ (Credit Utilization) పెరగవచ్చు. దీనివల్ల క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 2,00,000 ఉండి, మీరు 1,50,000 రూపాయల ఇన్‌కమ్ టాక్స్ కడితే మీ CUR ఏకంగా 75 శాతానికి చేరుతుంది. CUR 30 శాతం దాటితే, క్రెడిట్ బ్యూరోలు దీనిని రిస్క్‌గా భావిస్తాయి. మీ ఆర్థిక అవసరాల కోసం మీరు క్రెడిట్ కార్డ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారని వారు భావిస్తారు.

  • ఏప్రిల్ 1, 2026 నుండి ప్రతిపాదించిన కొత్త రూల్ ప్రకారం, మీ వార్షిక క్రెడిట్ కార్డ్ బిల్లు రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, ఆదాయపు పన్ను శాఖ దానిని చెక్ చేయవచ్చు. అందుకు అత్యవసరమైతే, నోటీసులు రాకుండా చూడటంతో పాటు జరిమానాలు లేకుండా చూసుకునేందుకు మాత్రమే క్రెడిట్ కార్డులను మీరు ఉపయోగించాలి.