LPG cylinder Price Reduced: జూన్ 1 నుండి దేశవ్యాప్తంగా LPG సిలిండర్ ధరలు దిగొచ్చాయి. పెట్రోలియం విక్రయ సంస్థలు (OMCs) గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దాంతో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ. 24 మేర తగ్గింది.
తాజా నిర్ణయంతో రెస్టారెంట్లు, హోటళ్లు లాంటి వాణిజ్య ప్రయోజనాలకు కమర్షియల్ సిలిండర్ వినియోగించే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. అవి తమ రోజువారీ జీవితంలో కమర్షియల్ సిలిండర్ పై ఆధారపపడతాయి. దాంతో ధర తగ్గడం వల్ల వ్యాపారం నడపడంలో వారి ఖర్చులు తగ్గుతాయి. దీనివల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే వీలుంటుంది. కానీ, గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ (Domestic LPG Cylinder) ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు.
ఏప్రిల్, మే నెలల్లో ధరలు ఇంత తగ్గాయి
వాణిజ్య సిలిండర్ ధరలు వరుసగా మూడవ నెలలో దిగొచ్చాయి. దీనికి ముందు, మే నెలలో రూ. 14.5 తగ్గించారు. ఏప్రిల్ నెలలో రూ. 41 మేర కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారు.
జూన్ 1 నుంచి కొన్ని ప్రధాన నగరాల్లో వాణిజ్య LPG కొత్త ధరలు
- దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1723.50.
- దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1674.50- హైదరాబాద్‌లో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.25.50 తగ్గడంతో రూ.1943.50కి దిగొచ్చింది
- కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1826 అయింది
- తమిళనాడు రాజధాని చెన్నైలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1881
- బెంగళూరులో కమర్షియల్ సిలిండర్ సవరించిన ధర రూ. 1,796.50. ఇక్కడ నిన్నటివరకూ ఈ ధర రూ. 1,820.50గా ఉండేది.
హైదరాబాద్‌లో ఎల్పీజీ సిలిండర్ ధరలు
- హైదరాబాద్‌లో 14.2 Kgల డొమోస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఏ మార్పు లేదు. రూ.905కు విక్రయాలు జరుగుతున్నాయి. డొమోస్టికల్ 5కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.335.50 అయింది. హైదరాబాద్‌లో 47.5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 4,855 వద్ద విక్రయిస్తున్నారు. తాజాగా ఈ సిలిండర్లపై రూ.63.50 మేర ధర దిగొచ్చింది. హైదరాబాద్‌లో ఏప్రిల్ 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ మీద రూ. 44 రూపాలు తగ్గింది. మే 1వ తేదీన 16.50 రూపాలు తగ్గడంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1969 అయింది.
నేటి నుండి నోయిడాలో వాణిజ్య సిలిండర్లు రూ. 1,723.50కి విక్రయాలు జరగనున్నాయి. చండీగఢ్- చండీగఢ్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,743 అయింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో వాణిజ్య సిలిండర్ ధర జూన్ 1 నుంచి రూ.1,752కి విక్రయిస్తారు. జైపూర్‌లో నిన్నటివరకూ రూ.1,776గా ఉన్న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర నేడు రూ.1,752కి దిగొచ్చింది.