PPF Investment | భారత పెట్టుబడిదారులు మెరుగైన రాబడితో పాటు, తమ డబ్బు సురక్షితంగా ఉండే, క్రమంగా బలమైన నిధిగా మారే పెట్టుబడి అవకాశ మార్గాలను వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి నెలా కొద్దికొద్దిగా డబ్బు ఆదా చేసి, భవిష్యత్తు కోసం పెద్ద మొత్తాన్ని కూడబెట్టాలని అనుకుంటారు.
వారికి సురక్షితమైన పథకం చాలా అవసరం. మీరు కూడా అలాంటి పథకంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మీకు ఒక ఎంపిక కావచ్చు. ప్రభుత్వ పథకం భద్రతతో పాటు రాబడి రెండింటినీ అందిస్తుంది. ఇక్కడ పెట్టుబడిదారులు చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టి పెద్ద మొత్తాన్ని కూడబెడతారు. దీని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
పీపీఎఫ్ లో పెట్టుబడి రూల్స్.. మెచ్యూరిటీ సమాచారం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒక ప్రభుత్వ పథకం. పీపీఎఫ్ మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. ఈ సమయంలో, పెట్టుబడిదారు ప్రతి సంవత్సరం ఖాతాలో కనీస నిర్ణీత మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. పీపీఎఫ్ లో వార్షిక కనిష్ట పెట్టుబడి రూ. 500 నుండి ప్రారంభమవుతుంది. మీరు ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిదారులకు ఈ పథకంపై 7.1 శాతం వార్షిక వడ్డీ సైతం లభిస్తుంది.
15 సంవత్సరాల మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత, పెట్టుబడిదారులు కోరుకుంటే పీపీఎఫ్ పథకాన్ని 5 సంవత్సరాల చొప్పున మరో రెండు సార్లు పొడిగించుకోవచ్చు. అంటే ఈ పీపీఎఫ్ పథకంలో పెట్టుబడిదారులు 25 సంవత్సరాల వరకు పెట్టుబడి కొనసాగించవచ్చు. మెచ్యూరిటీ తర్వాత విత్‌డ్రా చేసుకోకపోతే వడ్డీ వస్తూనే ఉంటుంది.
4000 పెట్టుబడితో 13 లక్షల కార్పస్ ను తయారు చేసుకోండి
పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పెద్ద మొత్తాన్ని పొందవచ్చు. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు పీపీఎఫ్ పథకంలో ప్రతి నెలా రూ. 4,000 జమ చేయడం ప్రారంభించినట్లయితే, సంవత్సరానికి మీ పెట్టుబడి రూ. 48,000 అవుతుంది.
ఈ విధంగా 15 సంవత్సరాల పాటు పెట్టుబడి కొనసాగిస్తే, మొత్తం పెట్టుబడి మొత్తం రూ. 7.20 లక్షలు అవుతుంది. పీపీఎఫ్ లో లభిస్తున్న వడ్డీ రేటు ప్రకారం, మెచ్యూరిటీ వద్ద మీకు సుమారు 13.01 లక్షల రూపాయలు లభిస్తాయి. అంటే ఇందులో దాదాపు 5.81 లక్షల రూపాయల లాభం ఉంటుంది. మీ చిన్న పెట్టుబడి అవసరం పడే సమయంలో పెద్ద మొత్తంగా మారవచ్చు.
Also Read: Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్