Personal Loan Interest Rates:జీవితంలో చాలామందికి పలు సందర్భాలలో అనుకోకుండా డబ్బు అవసరం పడుతుంది. కొన్నిసార్లు మనం ప్లాన్ చేసుకున్న వాటిని కొనుగోలు చేయాలన్నా, ఫంక్షన్ చేయాలన్నా, ముఖ్యమైన ఈఎంఐలు చెల్లించడం లాంటి పలు సందర్భాలు  వస్తాయి. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కొందరు ముందుగానే ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకుంటారు. దాంతో వారి పనులు పూర్తి చేసుకుంటాయి. అయితే, ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోనివారు వ్యక్తిగత రుణాలు (Personal Loan) వైపు మొగ్గు చూపుతారు.

Continues below advertisement

అయితే, వ్యక్తిగత రుణాలలో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, వివిధ బ్యాంకుల వ్యక్తిగత రుణాలపై అందించే వడ్డీ రేట్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. దీనివల్ల మీకు అధిక ఆర్థిక నష్టం జరగదు. అయితే పర్సనల్ లోన్ సమయంలో బ్యాంకులో అన్ని విషయాలు జాగ్రత్తగా చెక్ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే అందరు వ్యక్తులకు ఒకే రకమైన వడ్డీ రేట్లకు పర్సనల్ లోన్ లభించదు.

ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును తగ్గించింది. దీని తర్వాత అనేక బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గాయి. కొన్ని ప్రముఖ బ్యాంకుల వ్యక్తిగత రుణ వడ్డీ రేట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం....

Continues below advertisement

1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పర్సనల్ లోన్ వడ్డీ రేటు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు 10.05 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. ఖాతాదారుల సిబిల్ స్కోర్ (CIBIL Score), వ్యక్తిగత రుణ మొత్తం ఆధారంగా ఇందులో మార్పులు ఉండవచ్చు.

2. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు

బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) పర్సనల్ లోన్ విషయానికి వస్తే, బ్యాంకు తన ఖాతాదారులకు 10.15 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో లోన్ అందిస్తుంది. అయితే, ఈ రేటు అందరికీ ఒకేలా ఉండదని గమనించాలి. మీ సిబిల్ స్కోర్ ఎంత, మీరు ఎంత లోన్ తీసుకుంటున్నారు అనే ఈ రెండు విషయాల ఆధారంగా వడ్డీ రేటులో మార్పులు ఉండవచ్చు.

3. కెనరా బ్యాంక్ వడ్డీ రేటు

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు 9.25 శాతం ప్రారంభ వడ్డీ రేట్లతో పర్సనల్ లోన్  అందిస్తుంది. ఖాతాదారుల సిబిల్ స్కోర్, రుణ మొత్తం ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. మీ సిబిల్ స్కోర్ బాగుంటే, బ్యాంకు మీకు తక్కువ వడ్డీని లోన్ ఇస్తుంది.

4. ICICI బ్యాంక్ పర్సనల్ లోన్ వడ్డీరేట్లు

దేశంలోని పెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ICICI బ్యాంక్ 10.45 శాతం ప్రారంభ వడ్డీ రేట్లతో వ్యక్తిగత రుణాలు అందిస్తోంది. ICICI బ్యాంక్ తమ ఖాతాదారుల సిబిల్ స్కోర్, రుణ మొత్తం ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది.

5. HDFC బ్యాంక్ పర్సనల్ లోన్

HDFC బ్యాంక్ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్ల విషయానికి వస్తే, బ్యాంకు తన ఖాతాదారులకు 10.90 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ అందిస్తోంది.