Savings Account Interest Rates: ఫిబ్రవరి 7, 2025న జరిగిన ద్రవ్య విధాన సమావేశంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, తన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్‌ చేసి (RBI Repo Rate Cut) 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. 2020 తర్వాత, అంటే ఐదేళ్ల తర్వాత మొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గింది. రెపో రేట్‌ అంటే, వాణిజ్య బ్యాంకులు వివిధ హామీలతో అప్పులు తీసుకోవడానికి అనుమతి ఉన్న వడ్డీ రేటు. రెపో రేటు తగ్గితే, వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. అంటే రుణాలపై వడ్డీ తగ్గుతుంది. అదే విధంగా, బ్యాంక్‌ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు తగ్గవచ్చు. 


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు ‍‌(Interest rates on SBI savings accounts)


రూ. 10 కోట్ల వరకు డిపాజిట్లపై 2.70 శాతం;  రూ. 10 కోట్లకు పైగా డిపాజిట్లపై 3.00 శాతం చెల్లిస్తోంది. 15 అక్టోబర్ 2022 నుంచి ఈ రేట్లు అమల్లో ఉన్నాయి.


బ్యాంక్ ఆఫ్ బరోడా పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు (Interest rates on Bank of Baroda savings accounts)


బ్యాంక్ ఆఫ్ బరోడా, పొదుపు ఖాతాపై 2.75 శాతం నుంచి 4.10 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. రూ. లక్ష నుంచి రూ. 50 కోట్ల రూపాయల మధ్య డిపాజిట్లపై 2.75 శాతం;  రూ.50 కోట్ల నుంచి రూ. 200 కోట్ల మధ్య డిపాజిట్లపై 3.00 శాతం;  రూ. 200 కోట్ల నుంచి రూ. 500 కోట్ల మధ్య డిపాజిట్లపై 3.05 శాతం శాతం;  రూ. 500 కోట్ల నుంచి రూ. 1,000 కోట్ల డిపాజిట్లపై 4.10 శాతం వడ్డీ రేటు చెల్లిస్తోంది. 27 ఫిబ్రవరి 2024 నుంచి ఈ రేట్లు అమల్లో ఉన్నాయి.


పొదుపు ఖాతాలపై పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు ‍‌(Punjab National Bank interest rates on savings accounts)


రూ. 10 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్‌పై 2.70 శాతం;  రూ. 10 లక్షల నుంచి రూ. 100 కోట్లబ్యాలెన్స్‌పై 2.75 శాతం;  రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌పై 3.00 శాతం  వడ్డీ అందిస్తోంది. ఈ రేట్లు 01 జనవరి 2023 నుంచి అమల్లో ఉన్నాయి.


పొదుపు ఖాతాలపై ఐసీఐసీఐ బ్యాంక్‌ వడ్డీ రేట్లు (ICICI Bank interest rates on savings accounts)


రూ. 50 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్‌పై 3.00 శాతం;  రూ. 50 లక్షలకు పైగా ఉన్న బ్యాలెన్స్‌పై 3.50 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తోంది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు ‍‌(Interest rates on HDFC Bank savings accounts)


రూ. 50 లక్షల కంటే తక్కువబ్యాలెన్స్‌పై 3.00 శాతం;  రూ. 50 లక్షలకు పైగాబ్యాలెన్స్‌పై 3.50 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 06 ఏప్రిల్ 2022 నుంచి ఈ రేట్లు అమల్లో ఉన్నాయి.


కోటక్ మహీంద్రా బ్యాంక్ పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు (Interest rates on Kotak Mahindra Bank savings accounts)


రూ. 5 లక్షల వరకు ఖాతా నిల్వపై 3.00 శాతం;  రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల రూపాయల బ్యాలెన్స్‌పై 3.50 శాతం;  రూ. 50 లక్షలకు పైగా బ్యాలెన్స్‌పై 4.00 శాతం వడ్డీ రాబడిని అందిస్తోంది. ఈ రేట్లు 17 అక్టోబర్ 2024 నుంచి అమల్లో ఉన్నాయి.


మరో ఆసక్తికర కథనం: అంబానీ ఫ్యామిలీ సంపదకు సలాం - రెండో ర్యాంక్‌ కుటుంబం కంటే రెట్టింపు ఆస్తి