Best Personal Loan Rates: ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ లేదా స్కూల్‌ ఫీజ్‌ లేదా పెళ్లి పనులు వంటి వాటి కోసం అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే వ్యక్తిగత రుణం (Personal Loan) ఆదుకుంటుంది. పర్సనల్ లోన్‌లో ఉన్న అతి గొప్ప లక్షణం ఏమిటంటే.. నగదు అత్యంత వేగంగా అందుబాటులోకి వస్తుంది. దీని కోసం ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు లేదా సెక్యూరిటీగా డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, పర్సనల్‌ లోన్‌ తీసుకునేవాళ్లు ఎక్కువ వడ్డీ రేటు (Interest Rate Of Personal Loan) చెల్లించాలి. సాధారణంగా, పర్సనల్‌ లోన్‌ కోసం కార్‌ లోన్‌ (Car Laon) లేదా గృహ రుణం (Home Loan) కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాలి. 


రుణం తీసుకునే ముందు ఈ విషయం గుర్తుంచుకోండి
ఇక్కడ, కొన్ని ప్రధాన ప్రభుత్వ & ప్రైవేట్ బ్యాంకులు ఇస్తున్న వ్యక్తిగత రుణాలపై విధించిన వడ్డీ రేట్ల వివరాలు ఉన్నాయి. అయితే, వడ్డీ రేట్లు బ్యాంక్‌ నిర్ణయాలను బట్టి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. కాబట్టి, వ్యక్తిగత రుణం తీసుకునే ముందు బ్యాంకుకు వెళ్లి వడ్డీ రేటు గురించి పూర్తి సమాచారం పొందండి. అంతేకాదు, పర్సనల్‌ లోన్‌ కోసం అప్లై చేసుకున్న వ్యక్తి క్రెడిట్ స్కోర్‌, ఆదాయ వనరులు వంటి అంశాలను బట్టి కూడా వడ్డీ రేటు మారుతుంది. తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వ్యక్తులకు ఎక్కువ వడ్డీ రేటు & ఎక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీ రేటుకు లోన్‌ దొరుకుతుంది.


పర్సనల్‌ లోన్‌పై వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు:


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC bank) ---  10.85 నుంచి 24 శాతం వరకు


ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI bank) ---  10.85 నుంచి 16.25 శాతం వరకు


బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ---  11.40 నుంచి 18.75 శాతం వరకు


కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) ---  10.99 నుంచి 16.99 శాతం వరకు


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ---  11.45 నుంచి 14.60 శాతం వరకు


పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ---  12.40 నుంచి 17.95 శాతం వరకు


యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ---  10.49 నుంచి 22.50 శాతం వరకు


HDFC బ్యాంక్, దరఖాస్తుదారు ప్రొఫైల్ ఆధారంగా పర్సనల్ లోన్‌పై 10.85 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. దీంతో పాటు, జీఎస్టీ (GST)తో సహా బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 6,500 తీసుకుంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ 10.85 శాతం నుంచి 16.25 శాతం మధ్య వడ్డీని వసూలు చేస్తుంది & ప్రాసెసింగ్ రుసుమును 2 శాతం వరకు తీసుకుంటుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజుతో 10.99 నుంచి 16.99 శాతం వరకు వ్యక్తిగత రుణాలపై వడ్డీని రాబడుతుంది.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), తాను మంజూరు చేసే వ్యక్తిగత రుణాలపై 11.45 నుంచి 14.60 శాతం మధ్య వడ్డీని వసూలు చేస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సంవత్సరానికి 12.40 నుంచి 17.95 శాతం వడ్డీ తీసుకుంటుంది. యాక్సిస్ బ్యాంక్ 10.49 నుంచి 22.50 శాతం వరకు పర్సనల్‌ లోన్‌ వడ్డీని వసూలు చేస్తుంది. 


ఈ నెలాఖరు వరకు, అంటే 31 జనవరి 2025 వరకు, ప్రభుత్వ బ్యాంకులు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజ్‌ వసూలు చేయలేవు. ప్రైవేట్ బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజ్‌ కోసం లోన్‌ మొత్తంలో 2 శాతం వరకు తీసుకుంటాయి.


అప్లై చేసుకున్న ప్రతి వ్యక్తికి బ్యాంక్‌లు పర్సనల్‌ లోన్‌ మంజూరు చేయవు. దరఖాస్తుదారుడి క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score), క్రెడిట్‌ హిస్టరీ (Credit History), ఆదాయ వనరులు, బ్యాంక్‌తో సంబంధాలు వంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత లోన్‌ ఇవ్వాలో, వద్దో నిర్ణయిస్తాయి.


మరో ఆసక్తికర కథనం: నగలు కొనేవాళ్లకు లక్కీ డే, రూ.4,900 తగ్గిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ