Bank Interest Rates On 3 Year FDs: గత ఏడాది కాలంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDs) వడ్డీ రేట్లు బాగా పెరిగాయి. మీరు, లాంగ్‌టర్మ్‌ కాకుండా షార్ట్‌టర్మ్‌కే మీ ఎఫ్‌డీని పరిమితం చేయాలనుకుంటే, మూడేళ్ల టర్మ్‌ లోన్లపై కొన్ని స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకులు (SFBలు) మంచి వడ్డీ ఆదాయం చెల్లిస్తున్నాయి. 


మూడేళ్లలో మెచ్యూర్ అయ్యే FDలపై 8 శాతం పైగా వడ్డీ ఇస్తున్న స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకులు:


ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD ఇంట్రస్ట్‌ రేట్‌
889 రోజుల నుంచి 1095 రోజుల (3 సంవత్సరాలు) మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 8 శాతం వడ్డీ రేటును ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. అదే టైమ్‌ కోసం సీనియర్ సిటిజన్లు చేసే టర్మ్‌ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీని చెల్లిస్తోంది.


ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD ఇంట్రస్ట్‌ రేట్‌
1001 రోజుల నుంచి 1095 రోజుల (3 సంవత్సరాలు) మధ్య మెచ్యూర్ అయ్యే FDలకు 8 శాతం వడ్డీ రేటును ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అందిస్తోంది. అదే కాలవ్యవధిలో మెచ్యూర్ అయ్యే సీనియర్ సిటిజన్‌ FDలకు 8.6 శాతం వడ్డీ రేటు ఇస్తోంది.


ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD ఇంట్రస్ట్‌ రేట్‌
1000 రోజుల నుంచి 1500 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు, అదే కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.85 శాతం వరకు పెరుగుతుంది.


సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD ఇంట్రస్ట్‌ రేట్‌
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే FDలకు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ ప్రజలకు 8.6 శాతం వడ్డీ రేటు చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లకు, అదే టైమ్‌ పిరియడ్‌లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 9.1 శాతం వరకు వస్తుంది.


మరో ఆసక్తికర కథనం: ఇల్లు అమ్మితే వచ్చిన లాభంపై ఎంత టాక్స్‌ కట్టాలి?, LTCG లేదా STCGలో ఏది లెక్కించాలి? 


మూడేళ్ల టర్మ్‌ డిపాజిట్లపై ఇతర బ్యాంకుల్లో వడ్డీ రేట్లు:                


36 నెలల్లో మెచ్యూర్ అయ్యే FDలకు 8 శాతం వడ్డీ రేటును DCB బ్యాంక్ ఆఫర్‌ చేస్తోంది.


2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య FD మెచ్యూరిటీకి 7.5 శాతం వడ్డీ రేటును ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ అందిస్తోంది.


24 నెలల నుంచి 36 నెలల కాలంలో మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ రేటును RBL బ్యాంక్ చెల్లిస్తోంది.


751 రోజుల నుంచి 1095 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే టర్మ్‌ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటును IDFC ఫస్ట్ బ్యాంక్ అందిస్తోంది.


2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే FDలకు 7.25 శాతం వడ్డీ రేటును బంధన్ బ్యాంక్ ఆఫర్‌ చేస్తోంది.


మరో ఆసక్తికర కథనం: ఫారిన్‌ ఇన్వెస్టర్ల ఫుల్‌ ఫోకస్‌ వాటి పైనే, ఇక ఆ షేర్లను ఆపతరమా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial